క్రేజీ బ్యూటీస్ రెజీనా కసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం `శాకిని డాకిని`. కొరియన్ సినిమా `మిడ్ నైట్ రన్నర్స్`కు ఇది రీమేక్. కొరియన్ సినిమాలో ఇద్దరు యువకులు నటిస్తే.. తెలుగులో ఇద్దరు అమ్మాయిలతో ఈ మూవీని తీశారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుధీర్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్‌లపై దగ్గుబాటి సురేష్ బాబు, సునీత తాటి, థామస్ కిమ్ నిర్మించిన ఈ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ను సెప్టెంబర్ 16న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను బయటకు వదిలారు.

రెజీనా, నివేదా పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకునే అమ్మాయిలుగా కనిపించబోతున్నారు. ఈ ఇద్దరికీ ఒకరికొకరంటే అస్సలు పడదు. అలాంటిది వీరిద్దరూ కలిసి ఓ అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? వాటిని రెజీనా-నివేదా ఎలా ఎదుర్కొన్నారు..? అన్నదే ఈ సినిమా కథ అని తెలుస్తోంది.
తాజాగా బయటకు వచ్చిన ట్రైలర్ ఆధ్యంతం సూపర్ థ్రిల్లింగ్‌గా కొనసాగుతూ ఆకట్టుకుంది. యాక్షన్ సన్నివేశాల్లో రెజీనా-నివేదాలు మెంటలెక్కించారు. అలాగే వీరిద్దరి మధ్య కామెడీ కూడా అద్భుతంగా పడిందని ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. మొత్తానికి అదిరిపోయిన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. మరి ఆ అంచనాలను రెజీనా-నివేదా ఏ మేరకు అందుకుంటారో చూడాలి.