లేడీ పవర్ స్టార్, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `గార్గి`. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో కాళీ వెంకట్, కలైమామణి శరవణన్, ఆర్.ఎస్. శివాజీ, ఐశ్వర్య లక్ష్మి, జయప్రకాశ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. గోవింద్ వసంత సంగీతం అందించాడు.
తమిళ్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. తమిళంలో సూర్య, జ్యోతిక దంపతులు సమర్పకులుగా వ్యహరించారు. జూలై 15న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై పాజిటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది. ఇప్పటికే బాలికలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల నేపథ్యంలోనే ఎన్నో చిత్రాలు వచ్చాయి. `గార్గి`ని కూడా అలాంటి బ్యాక్‌డ్రాప్‌లోనే రూపొందించారు.
కానీ, ఇందులో బాధితుల స్ట్రగుల్స్, నిందితులుగా ఆరోపించబడ్డ వారి ఇళ్లలో ఉండే పరిస్థితులను ఎంతో చక్కగా, హృదయానికి హత్తుకునే విధంగా చూపించారు. ఆలోచింపజేసేలా ఉన్న ఈ సినిమా కథలో సాయి పల్లవి నటన మరింత ఆకట్టుకుంది. అయితే టాక్ బాగున్నా.. కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
తెలుగు వెర్షన్ కు రూ.3 కోట్ల రేంజ్లో థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. లాంగ్ రన్లో రూ.1.05 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. దీంతో ఈ మూవీ వల్ల బయ్యర్లకు రూ.1.95 కోట్ల లాస్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక `గార్గి` ఫైనల్ కలెక్షన్స్‌ను ఓ సారి గమనిస్తే..
నైజాం- 0.33 కోట్లు
సీడెడ్- 0.17 కోట్లు
ఉత్తరాంధ్ర- 0.18 కోట్లు
ఈస్ట్- 0.05 కోట్లు
వెస్ట్- 0.05 కోట్లు
గుంటూరు- 0.06 కోట్లు
కృష్ణా- 0.08 కోట్లు
నెల్లూరు- 0.03 కోట్లు
—————————–
ఏపీ + తెలంగాణ= 0.95 కోట్లు
—————————–
రెస్టాఫ్ ఇండియా- 0.05 కోట్లు
ఓవర్సీస్- 0.05 కోట్లు
—————————-
వరల్డ్ వైడ్= 1.05 కోట్లు
—————————-