ఆస‌క్తిక‌రంగా `గార్గి` ట్రైలర్.. అద‌ర‌గొట్టిన సాయి ప‌ల్ల‌వి!

Share

`ల‌వ్ స్టోరీ`, `శ్యామ్ సింగ‌రాయ్‌`ల‌తో వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఇటీవ‌ల `విరాట ప‌ర్వం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డినా.. సాయి ప‌ల్ల‌వి న‌ట‌న‌కు మాత్రం ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఇక‌పోతే ఇప్పుడు సాయి ప‌ల్ల‌వి మ‌రో మూవీతో అల‌రించేందుకు సిద్ధమైంది.

అదే `గార్గి`. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రామ‌చంద్రన్, ఐశ్వర్య ల‌క్ష్మీ, థామ‌స్ జార్జ్ నిర్మించారు. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై స్టార్ హీరో సూర్య, జ్యోతికలు ఈ మూవీని జూలై 15న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో విడుదల చేస్తున్నారు. అయితే నేటి సాయంత్రం ఈ మూవీ ట్రైల‌ర్‌ను బ‌య‌ట‌కు వ‌దిలారు.

`మేడమ్.. బ్రహ్మానందం పెద్ద కూతురు మీరేనా?` అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభ‌మైన ఈ ట్రైల‌ర్.. ఆధ్యంతం ఆస‌క్తిక‌రంగా సాగింది. తన తండ్రిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి ఓ కూతురు చేసే న్యాయ పోరాటమే `గార్గి`. ఇందులో టీజ‌ర్‌గా సాయి ప‌ల్ల‌వి త‌న‌దైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. గార్గి ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తన తల్లిదండ్రులతో కలిసి ఆమె జీవిస్తుంటుంది.

అయితే సడన్ గా గార్గి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో.. ఒక్క రోజులో వారి జీవితాలే తలక్రిందులు అవుతాయి. ఆ త‌ర్వాత తండ్రిని నిర్దోషిగా బయటకు తీసుకురావడానికి గార్గి ఏం చేసిందో తెలియాలంటే జూలై 15 వ‌ర‌కు ఆగాల్సిందే. ట్రైల‌ర్ చివ‌ర్లో `నువ్వు టైమ్, రాత, విధి.. అన్నిటినీ నమ్ముతావమ్మా. కానీ, నన్ను మాత్రం నమ్మవు. ఎందుకంటే.. నేను మగపిల్లాడిని కాదుగా, ఆడపిల్లను` అంటూ సాయి ప‌ల్ల‌వి చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే ఈ ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను సాయి ప‌ల్ల‌వి అందుకుంటుందో లేదో చూడాలి.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

52 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

2 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

4 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago