బుట్ట బొమ్మ పూజ హెగ్డే గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే పూజా హెగ్డే ముందు వరుసలో ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గత ఏడాది వరకు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కెరియర్ పరంగా దూసుకుపోయిన పూజా హెగ్డేకు.. ఈ ఏడాది నిరాసే మిగిలింది.
ఆమె నుంచి చివరిగా వచ్చిన ` రాధే శ్యామ్`, `బీస్ట్`, `ఆచార్య` చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. అయినా సరే పూజ హెగ్డే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆఫర్ల రావడం మానలేదు. తెలుగుతో పాటు హిందీలో వరుస సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే.. ప్రస్తుతం `కిసీ కా భాయ్ కిసీ కి జాన్` షూటింగ్లో బిజీగా ఉంది.
ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తుంటే.. టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. అయితే నేడు పూజా హెగ్డే బర్త్‌డే. అయినప్పటికీ ఆమె షూటింగ్లో పాల్గొంది. అయితే పూజ హెగ్డే బర్త్‌డే విషయాన్ని తెలుసుకున్న వెంకీ-సల్మాన్‌లు ఆమెకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు.
సెట్లో కెక్ కట్ చేయించి ఆమె బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో పూజా హెగ్డే.. `నేను ప్రేమించేది నా పనినే, షూటింగ్ నే. అలాంటి షూటింగ్ లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది` అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
Wishing the gorgeous @hegdepooja a very Happy Birthday from the team of #KisiKaBhaiKisiKiJaan@BeingSalmanKhan @VenkyMama @TheRaghav_Juyal @siddnigam_off @jassiegill @ishehnaaz_gill @palaktiwarii @farhad_samji pic.twitter.com/b4YGToUgH2
— Salman Khan Films (@SKFilmsOfficial) October 13, 2022