చైతుతో విడిపోయినా ఆ ఇంటిని మాత్రం వ‌ద‌ల‌ని సామ్‌..అమ్మేసి మ‌ళ్లీ కొంద‌ట‌!

Share

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత గురించి ఎటువంటి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌న‌దైన అందం, టాలెంట్‌తో సౌత్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ‌.. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడే నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకుని అక్కినేని ఇంటికి కోడ‌లు అయింది. చైతు-సామ్ దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని.. పెళ్లి చేసుకున్నారు.

2017 గోవాలో పెద్ద‌ల స‌మ‌క్షంలో రెండు సాంప్ర‌దాయాల ప్ర‌కారం అంగ‌రంగ వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. కానీ, ఎక్కువ కాలం వీరు క‌లిసి ఉండ‌లేక‌పోయారు. కొద్ది నెల‌ల క్రిత‌మే విడాకులు తీసుకుని సామ్‌-చైతూ స‌ప‌రేట్ అయిపోయారు. అయితే చైతుతో విడిపోయినా అత‌డితో క‌లిసి ఉన్న ఇంటిని మాత్రం ఆమె వ‌దిలి పెట్ట‌లేదు.

పైగా ఆ ఇంటిని ఒకసారి అమ్మేసి.. మ‌ళ్లీ ఎక్కువ డ‌బ్బు పెట్టి సామ్ కొనుక్కుంద‌ట‌. ఈ విష‌యాన్ని తాజాగా సీనియర్‌ నటుడు మురళీ మోహన్‌ బయటపెట్టాడు. ముర‌ళీ మోహ‌న్ త‌న త‌న‌యుడి కోసం క‌ట్టించుకున్న అపార్ట్‌మెంట్‌నే చైతు-సామ్‌లు కొనుగోలు చేశారు. పెళ్లి త‌ర్వాత ఆ అపార్ట్‌మెంట్‌లోనే కాపురం పెట్టారు. ఈ విష‌యంపై ముర‌ళ్లీ మోహ‌న్ మాట్లాడుతూ.. `నాగచైతన్య- సమంత మా అపార్ట్‌మెంట్‌నే కొనుక్కున్నారు. అందులోనే కలిసి ఉండేవారు. తర్వాత వారిద్దరూ ఉండే అపార్ట్‌మెంట్‌ను అమ్మేసి.. ఓ ఇండిపెండెంట్‌ హౌస్‌ కొనుక్కున్నారు.

కానీ కొత్తిల్లు రీమోడలింగ్‌ చేసేంతవరకు ఇక్కడే ఉంటామని అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇంతలోనే మనస్పర్థలు వచ్చి వారిద‌ద‌రూ విడిపోయారు. ఆ తర్వాత మంచి ఇంటి కోసం సమంత చాలా వెతికింది. కానీ, ఏదీ న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు సౌక‌ర్యాలు, సేఫ్టీ ఇక్కడే బాగుందని భావించి అమ్మేసిన అపార్ట్‌మెంట్‌నే త‌న‌కు కావాలంటూ స‌మంత నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అప్పుడు ఆ ఇల్లు కొన్నవాళ్లతో మాట్లాడి వారికి ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ ఆ ఇంటిని తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం అక్కడే తన తల్లితో కలిసి నివసిస్తోంది` అంటూ చెప్పుకొచ్చారు.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

32 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

41 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago