Samantha in Malayalam Movies/Mollywood: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రెసెంట్ టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. చైతూతో విడాకుల అనంతరం సమంత కెరీర్ మీదే ఎక్కువ ఫోకస్ చేసింది. వరుస సినిమాలు, యాడ్స్, ఐటెం సాంగ్స్ ఇలా వచ్చిన ప్రతి ఆఫర్ ని ఓకే చేసేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో మూడు సినిమాలు, తమిళ్ లో ఒక సినిమా, బాలీవుడ్ లో ఒక సినిమా, ఒక సిరీస్, ఒక హాలీవుడ్ సినిమా చేస్తుంది. ఇలా చేతిలో దాదాపు అరడజను పైగా ప్రాజెక్టులతో బిజీగా ఉంది సమంత. మరో వైపు యాడ్స్ కూడా వరుసగా చేస్తూ బాగానే డబ్బులు సంపాదిస్తుంది.
మలయాళంలో అరంగేట్రం చేయనున్న సమంత..
దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన సమంత ఇప్పటివరకు మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. మలయాళంలో సీనియర్ దర్శకుడైన షాజీ కైలాస్ ‘పింక్ పోలీస్’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనుందని తెలుస్తున్నది. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని..కథతో పాటు తన పాత్రలోని వైవిధ్యం నచ్చడంతో ఆమె ఈ సినిమాకు అంగీకరించిందని అంటున్నారు.
పలు భాషల సినిమాలతో బిజీ బిజీ..
ప్రస్తుతం సమంత ఖుషి, యశోద, శాకుంతలం సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉంది. అలానే ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ కోసం వరుణ్ ధావన్ తో కలిసి నటించనుంది. త్వరలో ‘ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే హాలీవుడ్ మూవీలో నటించనుంది. వీటి అనంతరం మలయాళం సినిమా మొదలు పెడతారని తెలుస్తుంది. మొత్తానికి వరుస సినిమాలతో సమంత బిజీబిజీగా మారింది.