Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గతం గురించి అందరికీ తెలిసిందే. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లిన చేసుకున్న ఈ బ్యూటీ.. ఎక్కువ కాలం అతడితో కలిసి ఉండలేకపోయింది. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైతుతో విడిపోయి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్న ఈమె.. కెరీర్‌పైనే ఫోకస్ పెట్టి వరుస ప్రాజెక్ట్‌తో దూసుకుపోతోంది.
ఇటీవలె `శాకుంతలం`, `యశోద` వంటి పాన్ ఇండియా చిత్రాలను పూర్తి చేసుకున్న సమంత.. ఇప్పుడు విజయ్ దేవరకొండ సరసన `ఖుషి` సినిమాలో నటిస్తోంది. అలాగే మరిన్ని ప్రాజెక్ట్స్‌కు కూడా ఆమె సైన్ చేసింది. అయితే ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సోషల్ మీడియాను మాత్రం సామ్ వదిలిపెట్టడం లేదు.
ఓవైపు చేతినిండా చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతూ.. మరోవైపు ఫొటో షూట్లు, చిట్ చాట్లు, ఇంట్రస్టింగ్ పోస్ట్‌లతో సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే సామ్ ఊరికే టైంపాస్ కోసం సోషల్ మీడియా యూజ్ చేయడం లేదట. దానిని కూడా ఆదాయ వనరుగా మార్చుకొని కోట్లు వెనకేసుకుంటుందట. సోషల్ మీడియా ద్వారా కూడా సమంత పలు బ్రాండ్స్‌ని ప్రమోట్ చేస్తోంది. ఇలా ప్రమోట్ చేసినందుకుగానూ కోట్ల రూపాయలు ఆమె అకౌంట్లో పడిపోతాయట.
నెట్టింట వైరల్ అవుతోన్న కథనాల ప్రకారం.. సమంత ఇన్‌స్టా ద్వారా నెలకు ఏకంగా రూ. 3 కోట్ల వరకు సంపాదిస్తుందని తెలుస్తోంది. సాధారణంగా ఫాలోవర్స్, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో సెలబ్రెటీలకు డబ్బు చెల్లిస్తుంటారు. ఇన్ స్టాలో సమంతకు రెండు కోట్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆమె పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే సమంత నెలకు అన్ని కోట్లు సంపాదిస్తుందని అంటున్నారు.
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…
KTR: మోడీ (Modi)జీ.. భారత రూపాయి పతనవడానికి కారణం ఏమిటీ.. ? బీజేపీ (BJP)కి చెందిన ఉత్తరకుమారులు ఎవరి దగ్గరైనా ఈ…