టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస చిత్రాలను లైన్‌లో పెడుతూ కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చేతిలో శాకుంతలం, యశోద, ఖుషి వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో శాకుంతలం, యశోద చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకోగా.. `ఖుషి` షూటింగ్ దశలో ఉంది.
ఇకపోతే సమంత త్వరలోనే పోలీస్ ఆఫీసర్‌గా అలరించబోతోందట. అది కూడా ఓ స్టార్ హీరో మూవీలో అని అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లితో `వారసుడు(తమిళంలో వారిసు)` అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.
సైలెంట్ అయిపోయిన సమంత.. అభిమానులు ఆందోళన!
ఈ మూవీ అనంతరం విజయ్ దళపతి `మాస్టర్` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తన 67వ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో సమంత నటించబోతోందట. అయితే హీరోయిన్‌గా కదండోయ్.. విలన్‌గా అని టాక్ నడుస్తోంది.
నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో సమంత కనిపించబోతోందని, లేడీ విలన్‌గా విజయ్‌కు ఆమె చుక్కలు చూపిస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, ఇప్పటికే సమంత `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ ప్రాజెక్టులో నెగెటివ్ రోల్‌లో నటించింది. ఇందులో ఆమె పాత్రకు గానూ విమర్శకులు నుండి ప్రశంసలు దక్కాయి.
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ త్వరలోనే `లైగర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్…
"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…