2010లో విడుదలైన `ఏ మాయ చేశావే` మూవీతో గ్రాండ్‌గా సినీ కెరీర్ ను ప్రారంభించిన అందాల భామ సమంత.. అతి తక్కువ సమయంలోనే తనదైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. టాలీవుడ్లో దాదాపు టాప్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే నాగచైతన్యను పెళ్లాడి అక్కినేని ఇంటికి కోడలు అయింది.
అయితే వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందు విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇక విడాకుల తర్వాత కెరీర్ పరంగా మరింత జోరు చూపిస్తున్న సమంత.. భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెడుతూ దూసుకుపోతోంది.
మరోవైపు సోషల్ మీడియాలో రోజురోజుకు తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటూ దుమ్మదులిపేస్తోంది. తాజాగా ట్విట్టర్లో సమంత ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 10 మిలయన్లకు చేరుకుంది. అంటే ట్విట్టర్‌ను ఆమెను ఏకంగా కోటి మంది ఫాలో అవుతున్నారు. ట్విట్టర్లో ఈ స్థాయిలో ఫాలోవర్స్ అంటే మామూలు విషయం కాదు.
టాలీవుడ్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ కలిగిన హీరోయిన్ల జాబితాలో సమంతనే నెం.1 పొజీషియన్‌లో నిలిచింది. మిగిలిన హీరోయిన్లు ఆమె ముందు దిగదుడుపే. ఎందుకంటే, సమంత దరి దాపుల్లో కూడా ఎవరూ లేదు. సమంత తర్వాత తమన్నా 5.5 మిలియన్స్ ఫాలోవర్స్ తో రెండో స్థానంలో ఉంది. 5.1 మిలియన్స్ తో రకుల్ నాల్గో స్థానం, 5 మిలియన్లతో కీర్తి సురేష్ ఐదో స్థానం, 4.7 మిలియన్లతో పూజా హెగ్డే ఆరో స్థానంలో ఉంటే.. 4 మిలియన్స్ తో రష్మిక ఏడో స్థానంలో నిలిచింది.