యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఈ మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లబోతోంది. `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనంతరం ఎన్టీఆర్ చేస్తున్న చిత్రమిది.
నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితం కానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ స్వరాలు అందిస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. ఇకపోతే ఈ చిత్రంలో ఎన్టీఆర్ తో జోడీ కట్టే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.
అయితే ఇప్పటికే అలియా భట్, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, రష్మిక తదితరుల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరూ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక రీసెంట్ గా కొరటాల శివ టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతను సంప్రదించారట. అయితే ఆమె ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేసిందట. అందుకు కారణం అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వకపోవడమే అట.
సమంత `ఎన్టీఆర్ 30`కిగానూ ఏకంగా రూ. 4 కోట్లు డిమాండ్ చేసిందట. కానీ, మేకర్స్ మాత్రం అందులో సగం మాత్రమే ఇస్తామని అన్నారట. అయితే అడిగినంత ఇవ్వకుంటే సినిమా చేయలేనని సామ్ తేల్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో వాళ్లకే తెలియాలి. కాగా, సామ్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె `యశోద`, `ఖుషి`, `శాకుంతలం` చిత్రాల్లో భాగం అయింది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ కూడా ఆమె చేతిలో ఉన్నాయి.