టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి–హరీష్ ద్వయదర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీదేవీ మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యాక్షర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడెక్షన్ పనులను జరుపుకుంటోంది.
రీసెంట్గా బయటకు వచ్చిన యశోద టీజర్.. ఎంతలా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రెగ్నెంట్ లేడీగా సమంత అద్భుతమైన పర్ఫామెన్స్తో విశేషంగా అలరించింది. ఇకపోతే ఈ సినిమాకు సమంత అందుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ సినిమాకు గానూ సమంత 50 రోజుల కాల్షీట్స్ ఇచ్చిందట. అయితే అందుకుగానూ ఆమె ఏకంగా రూ. 5 కోట్ల రేంజ్లో రెమ్యునరేషన్ పుచ్చుకుందని తాజాగా ఓ వార్త బయటకు వచ్చి నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, ఈ చిత్రాన్ని త్వరలోనే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా రానుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!