ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే మూవీ చేసిన సంగతి తెలిసిందే. మహాకవి కాళిదాసు రచించిన `అభిజ్ఞాన శాకుంతలం` కావ్యం నుంచి ఈ కథా వస్తువును తీసుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో రసరమ్య దృశ్యకావ్యంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ఈ సినిమాలో బుల్లి భరతుడి పాత్రను పోషించింది. అలాగే సచిన్ ఖేడేకర్, కబీర్ బేడీ, మోహన్ బాబు, ప్రకరాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు అందించారు.
ఎప్పుడో షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు. అయితే ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్‌కు మోక్షం లభించింది. ఈ ఏడాది నవంబర్ 4న `శాకుంతలం` ప్రపంచ వ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ మేరకు మేరక్స్ అధికారిక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ అప్డేట్ తో సమంత ఫ్యాన్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. పైగా నవంబర్ లో ఎలాంటి పెద్ద సినిమాలు లేవు. ఈ నేపథ్యంలోనే `శాకుంతలం`కు సేఫ్ డేట్‌ను లాక్ చేశారని, ఇది సినిమాకు బాగా కలిసొచ్చే అంశం అని అంటున్నారు.
https://twitter.com/SVC_official/status/1573167834322317313?s=20&t=5ChF9VPIUSpiWxPYI–2nw
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!