ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `యశోద` ఒకటి. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు.
శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇందులో సమంత ప్రెగ్నెంట్ లేడీ గా కనిపించబోతోంది.
ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. దీంతో ఈ చిత్రానికి అదిరిపోయే విధంగా బిజినెస్ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించినట్టు తెలుస్తోంది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ సమస్థ అమెజాన్ ప్రైమ్ వారు యశోద డిజిటల్ హక్కులను కళ్ళు చెదిరే రేటుకు సొంతం చేసుకున్నారట. రూ. 40 కోట్లు చెల్లించి యశోద ఓటీటీ రైట్స్ ను దక్కించుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత ఈ సినిమా ఓటిటిలో సందడి చేయనుంది.
https://newsorbit.com/entertainment-news/samantha-remuneration-for-yashoda-movie.html