23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
Entertainment News సినిమా

`యశోద` స్టోరీ మొత్తం లీక్.. సమంత లైఫ్ కి దగ్గరగా ఉన్నట్టుందే?!

Share

ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన తాజా చిత్రం `యశోద`.‌ హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించారు. క్రైమ్‌ థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్‌, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ సినిమా స్టోరీ మొత్తం లీక్ అయింది. యశోద కథ ఇదే అంటూ నెట్టింట ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

samantha yashoda movie
samantha yashoda movie

దాని ప్రకారం.. ఒక వ్యక్తి ముఖానికి రాసుకునే మెడిసిన్ కనిపెడతాడట. ఆ మెడిసిన్ రాసుకుంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులుగా కనిపిస్తార‌ట‌. కానీ, ఆ మెడిసిన్ యూజ్ చేసే వ్యక్తిల్లో వింత మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే ఆ మెడిసిన్ వెనుకున్న రహస్యాలను తెలుసుకునేందుకు సమంత విదేశాలకు వెళ్తుందట.

అక్కడ ఆమెకు ఎన్నో సవాళ్లు, చిక్కులు ఎదురవుతాయట. వాటిని ఆమె ఎలా ఛేదించింది అన్నదే ఈ సినిమా కథ అని ప్రచారం జరుగుతోంది. ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాదు గానీ.. రియల్ లైఫ్ లో కూడా సమంత పలు చర్మవ్యాధులతో బాధపడుతోంది. వాటి నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం విదేశాల‌కు వెళ్లింద‌నే టాక్ ఉంది. ఈ నేపథ్యంలోనే యశోద కథ ఆమె లైఫ్ కు దగ్గరగా ఉన్నట్లుంది అంటూ నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


Share

Related posts

Sukumar: పుష్ప 2 ఇప్పట్లో సెట్స్ మీదకు రానట్టే..కారణం ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2..?

GRK

Gayathrie White Dress Pics

Gallery Desk

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా సినిమాకి సీనియర్ దర్శకుడు అవసరం..!

GRK