NewsOrbit
Entertainment News సినిమా

మ‌హేశ్‌, ప‌వ‌న్‌, ఎన్టీఆర్‌ల‌పై `భీమ్లా` బ్యూటీ ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌!

Share

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించిన‌ `భీమ్లా నాయక్` మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన సంయుక్త‌.. తొలి సినిమాతోనే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులు వేయించుకుంది.

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటున్న సంయుక్త‌.. నేడు `బింబిసార‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంది. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా తెర‌కెక్కిన హిస్టారికల్ మూవీ ఇది. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీ వశిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొత్త ఫామ్‌హౌస్ అన్ని కోట్లా.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే..!

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా నేడు గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న సంయుక్త మీన‌న్.. `బింబిసార‌` కోసం టీమ్ మొత్తం ఎంతో కష్టపడ్డారని, ముఖ్యంగా హీరో కళ్యాణ్ రామ్ ప్రాణం పెట్టి నటించారని, తప్పకుండా త‌మ సినిమా మంచి విజయం అందుకుంటుందని ఆమె పేర్కొంది. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన మ‌హేశ్ బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఎన్టీఆర్‌ల‌పై ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్ చేసింది.

పవన్ కళ్యాణ్ ఓ అద్భుతమని ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని తెలిపిన సంయుక్త.. మ‌హేశ్ బాబు ఎల్లప్పుడూ ప్రకాశించే రాక్ స్టార్ అని తెలిపింది. ఇక ఎన్టీఆర్ గురించి చెబుతూ.. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ తో మాట్లాడానని, ఆయన నటనా ప్రావిణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే అని తెలిపింది. దీంతో సంయుక్త కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్‌గా మారాయి.


Share

Related posts

‘రాజమౌళితో విసిగిపోతున్నాం..’ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆవేదన..!

Muraliak

Venkatesh: వెంకీమామతో స్టెప్పులేయబోతున్న పొడుగుకాళ్ల సుందరి!

Ram

‘వకీల్ సాబ్’ గా పవన్ కళ్యాణ్ దిల్ రాజు కి షాక్ ఇవ్వబోతున్నాడా…?

siddhu