Krishna Mukunda Murari : ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని చాలామంది తమలో ఉన్న టాలెంట్ ని సోషల్ మీడియా ద్వారా బయటపెడుతూ ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్, కామెడీ షోలు, డాన్స్ షోలు అంటూ అవకాశాలు దక్కించుకుంటూ మరింత బిజీగా మారిపోతున్న విషయం తెలిసిందే.

అయితే అందులో మరికొంతమంది సీరియల్స్ లో నటిస్తూ అక్కడ పాపులారిటీ దక్కించుకొని కాస్త సమయం దొరికితే చాలు స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ ఉంటారు. అంతేకాదు తాము ఎక్కడికి వెళ్తున్నాము ? ఏం చేస్తున్నాము? అన్న విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణా ముకుందా మురారి సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుంది అంటే అందులో నటీనటులు ఎక్కడ కనిపించినా సరే వారిని అభిమానులు చూడడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ సీరియల్లో నటిస్తున్న కృష్ణ అలాగే మురారి ఇద్దరు కూడా తమదైన నటనతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారని చెప్పాలి.

ఇక కృష్ణ అసలు పేరు ప్రియాంక కంభం , ముకుంద అసలు పేరు అనూష రావు.. ఇక వీరిద్దరూ తాజాగా విదేశాలకు వెళ్లడానికి పయనమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎయిర్పోర్ట్లో నుంచి వారు ఒక ఫోటోను షేర్ చేస్తూ ఫ్లైట్ టైమింగ్ పోస్ట్ పోన్ అయినట్లు వెల్లడించారు. యాక్చువల్ గా ఫ్లైట్ టైం రాత్రి 10:50 కాగా.. సమయాన్ని మారుస్తూ తెల్లవారుజామున 5:40 గంటలకు మార్చినట్లు వెల్లడించారు..

ఇక ఆ సమయంలో అటు కృష్ణ ఇటు ముకుందా ఇద్దరు కూడా అంత సమయం ఎయిర్ పోర్ట్ లో ఏం చేయాలో తెలియక సెల్ఫీలు దిగుతూ అక్కడి వారితో ముచ్చటిస్తూ ఫోటోలను షేర్ చేశారు. ఇక వీరు తమ ఇంస్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఈ స్టోరీ ఇప్పుడు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి.