NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

NTR: వందల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్ర ఎందుకు వేయలేదు..?

NTR: ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో వారి గురించి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం చాలా కామన్. కానీ ఇండస్ట్రీకి దూరమై కొన్ని దశాబ్దాలు ఆయనప్పటికీ వారి గురించి ప్రేక్షకులు ఇంకా ఆలోచిస్తున్నారు అంటే వారు ప్రేక్షకుల్లో ఏ విధమైన గుర్తింపును సంపాదించుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ప్రెసెంట్ ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఆయనే నందమూరి తారకరామారావు. దేవుడు ఎలా ఉంటారో కూడా పెద్దగా ఎవ్వరికీ తెలియదు.

senior NTR updates
senior NTR updates

దేవుడు రూపాన్ని రీ క్రియేట్ చేస్తూ సినిమాలు చేసిన ఈయన ఫొటోస్ని ప్రతి ఇంట్లో పెడుతూ దేవుడిగా పూజిస్తారు. అంతటి గొప్ప మనిషి మరి నందమూరి తారకరామారావు. తను నటనతో విధ్వంసం పుట్టించిన ఈయన అనంతరం రాజకీయాల్లో కూడా కొనసాగి గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. ప్రెసెంట్ ఈయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కొనసాగుతుందో మనందరికీ తెలిసిందే. ఒకపక్క సినిమాలతో దుమ్ము దూలపడమే కాకుండా మరో పక్క పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర వేశారు నందమూరి తారకరామారావు. తెలుగు ప్రేక్షకులకి రాముడు మరియు కృష్ణుడు అంటే గుర్తుకొచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారకరామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. డైలాగులు మరియు హావాభావాలు పలికించడంలో ఆయనకి తిరుగేలేదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక పాత్రలకు మరియు చిత్రాలకు ఆయన విశ్వరూపం. రాముడు మరియు కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. కృష్ణుడిగా దాదాపు అత్యధిక సార్లు తెరపై కనిపించి రికార్డ్ సృష్టించారు. మరి అంత పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఈనా తన సినీ ప్రస్థానంలో నారదుడు మరియు హనుమంతుడి పాత్రలను మాత్రం వేయలేదు. ఇదే విషయం ఓసారి ఆయన వద్ద ప్రశ్నిస్తే..” అప్పట్లో షూటింగ్స్ జరుగుతున్నప్పుడు తరచూ కరెంటు పోయేది. మళ్లీ ఎప్పుడొచ్చాదో తెలియదు. కరెంటు వచ్చేదాకా అందరూ ఫ్లోర్ బయటికి వచ్చి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్లు. అలా ఓ చిత్ర షూటింగ్ సమయంలో కరెంటు పోతే ఫ్లోర్ బయటకు వచ్చి కూర్చుని ఎన్టీఆర్ పౌరాణిక పాత్రల గురించి మాట్లాడుకున్నారు.

అందరూ ఆసక్తిగా విన్నారు. అక్కడే ఉన్న రవి కొండలరావు మధ్యలో కలగా చేసుకుని.. నారదుడు, హనుమంతుడు వంటివి ముఖ్య పాత్రలే కదా? అన్నయ్యగారు.. ఈ పాత్రలో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా? అని అడిగారట. ఇక అప్పుడు ఎన్టీఆర్ బదులిస్తూ.. నారదుడిగా ఆలోచించాను బ్రదర్. హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా మరియు సర్వజ్ఞుడిగా ‌ గంభీరంగా ప్రవర్తించవచ్చు. కానీ నా రూపం అందుకు సహకరించలేదు. నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీ అవుతుందని ఆ ఆలోచన రానివ్వలేదు. రామారావు గారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు. ఇక హనుమంతుడు అంటావా? నా మొఖం కనప్పుడు నాకెందుకు ఆ పాత్ర? మాస్క్ తో నటించాలి. ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువ కావాలి.. అని ” ఆ రెండు పాత్రలని వద్దనుకున్నాడట ఎన్టీఆర్. ‌ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella