ప్రపంచ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డు అనేది పెద్ద సంచలనం. ఆస్కార్ అవార్డు దక్కింది అంటే ఆ నటుడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుద్ది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు 16 మంది ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నరు. 16 మందిలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఒకరు. కానీ తెలుగు సినిమా రంగంలో ఇప్పటివరకు ఎవరు కూడా ఆస్కార్ అవార్డు అందుకోలేకపోయారు. కానీ ఫస్ట్ టైం టాలీవుడ్ చరిత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అయినట్లు వార్త రావడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ప్రపంచంలో ప్రముఖ మూవీ పబ్లికేషన్స్ “VARIETY” (అమెరికా) ఆస్కార్ 2023కి గాను ఉత్తమ నటుడు అవార్డుకు పోటీలో నటుల పేర్లను ప్రచురించింది.
ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ పేరు ఐదో స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆసియా నుంచి ఉన్న ఏకైక నటుడు ఎన్టీఆర్ యే. దీంతో తెలుగు నటుడికి ప్రపంచ స్థాయిలో గుర్తింపురావడం ఇప్పుడు సంచలనం రేపుతుంది. “RRR”లో ఎన్టీఆర్ చేసిన కొమరం భీం పాత్రకు గాను ఎన్టీఆర్ పేరు ఆస్కార్ కి నామినేట్ అయినట్లు లిస్టులో ఉన్న సమాచారం బట్టి తెలుస్తుంది. ప్రముఖ మూవీ పబ్లికేషన్ వెరైటీ ప్రకటించిన ఈ జాబితా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఈ క్రమంలో తమ అభిమాన నటుడు ఎన్టీఆర్ పేరు ఉండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ సంతోషంగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” లో తారక్ తో పాటు చరణ్ కూడా నటించడం తెలిసిందే. కానీ తారక్ క్యారెక్టర్ కొమరం భీం పాత్ర హాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ నటన పట్ల చాలామంది సోషల్ మీడియాలో హాలీవుడ్ టెక్నీషియన్ లు రియాక్ట్ కావడం జరిగింది. గోండు జాతి నాయకుడిగా.. ఎన్టీఆర్ పాత్ర ప్రారంభం నుండి చివరి వరకు హృదయాలను పిండేసేటట్టు ఉంటది. తన జాతి పిల్ల కోసం పోరాటం.. మరోపక్క స్నేహం కోసం ఆరాటం.. సన్నివేశాలలో ఎన్టీఆర్ స్క్రీన్ పై నటన విశ్వరూపం చూపించారు. “RRR” సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఈ సినిమాతో కెరియర్ లో మొట్టమొదటి ఇండస్ట్రీ హిట్ కూడా అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమోగుతున్న ఈ క్రమంలో.. ఏకంగా ఆస్కార్ అవార్డు ఉత్తమ నటుడు జాబితాలో ఎన్టీఆర్ పేరు ఉన్నట్లు వార్తలు రావడం ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే సంచలనం రేపుతుంది.