Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒకప్పుడు వరస పెట్టి బ్లాక్ బస్టర్ లు మనోడికి పడేవి. దీంతో బాలీవుడ్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ పేరు మారుమ్రోగేది. కానీ తాజా పరిస్థితులు చూస్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్ సినిమా ఒకటి కూడా పడలేదు. దాదాపు నాలుగు సంవత్సరాల నుండి దక్షిణాది సినిమాలు తిరుగులేని విజయాలు సాధిస్తున్నాయి. ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం వందల కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాయి.

ఇటువంటి పరిస్థితులలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీకి రాలేక చతికల పడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా షారుక్ ఖాన్ ఓటిటి రంగంపై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే కరోనా తర్వాత ప్రేక్షకులలో కంటెంట్ చూసే విధానం మారిందని తెలియజేశారు. మొబైల్ స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది. అందులో సినిమాని థియేటర్ లో చూసినా అనుభూతి కలగదని పేర్కొన్నారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా గాని సినిమా స్థాయిని ఏది తగ్గించదని షారుక్ తెలియజేయడం జరిగింది. సినిమాని ఆదరించేవారు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారని.. షారుక్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

కరోనా వచ్చాక ఓటిటి లకి మంచి గిరాకి పెరిగింది. పెద్ద హీరోల సినిమాలు కూడా ఓటీటీ లలో విడుదలవుతున్న పరిస్థితులు ప్రస్తుతం కనబడుతున్నాయి. ఏదైనా సినిమా భారీ అంచనాల మధ్య విడుదలయ్యి నెగటివ్ టాక్ వచ్చింది అంటే కొద్ది వారాలకే ఆ సినిమా ఓటీటీ లలో రిలీజ్ చేస్తున్నారు. అప్పట్లో కరోనా వచ్చిన ప్రారంభంలో.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు థియేటర్ లు మూతపడటంతో…ఓటీటీ రంగం పుంజుకుంది. ఈ క్రమంలో థియేటర్ లో సినిమా చూసే విధానం వేరు సెల్ ఫోన్ లో ఓటీటీ లలో.. సినిమా చూసే విధానం వేరు అని షారుక్ తాజా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.