
Jawan OTT Rights Record: ఇండియాలో ఇప్పుడు చాలా మంది పాన్ ఇండియా స్థాయి నటులు వచ్చారు కానీ, చాలా కాలం క్రితమే ఆ స్థాయికి చేరుకోవడంతో పాటు ఎన్నో ఘనతలు, రికార్డులను సృష్టించిన హీరోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఒకప్పుడు వరుస హిట్లతో సత్తా చాటిన ఆయన.. చాలా కాలం పాటు ఫ్లాపుల పరంపరతో ఇబ్బంది పడ్డాడు. ఈ పరిస్థితుల్లోనే ‘పఠాన్’తో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు ‘జవాన్’ సినిమాను చేశాడు. పఠాన్ హిట్ అవడం వలన ఆరంభంలోనే ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ జవాన్ సినిమా తో మళ్ళీ మాంచి ఫారం లోకి వచేసాడు. ఇదివరకటి క్రేజ్ కన్నా విపరీతమైన క్రేజ్ తో జనాలు షారుఖ్ సినిమాలు చూస్తున్నారు. తాజాగా ఆయన హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’. పూర్తిగా యాక్షన్ మరియు వినోదమే ప్రధానం గా రూపొందించారు. ఈ సినిమా కి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అలాగే, ఇండియాలో కూడా అదే కనిపిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే దక్కుతోంది. ఉత్తర దక్షిణ భారత్ లలో ఈ సినిమా షోలకు బుకింగ్స్ చాలా బాగున్నాయి. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘జవాన్’ మూవీ ఓటీటీ వివరాలు విడుదల అయ్యాయి.

‘జవాన్’ మూవీపై నెలకొన్న అంచనాల కారణంగా.. దీని డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. అందుకు అనుగుణంగానే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. అంతేకాదు, థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతనే ఈ చిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. అంటే సెప్టెంబర్ 7న విడుదలైన ‘జవాన్’ నవంబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని సమాచారం.

ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బజ్జెట్ తో ఈ చిత్రాన్ని తీశారు . ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్ర పోశించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ మూవీ సంబంధించిన ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కెర్లు కొడుతోంది .
Jawan Review: షారూఖ్ ఖాన్ జవాన్ సినిమా రివ్యూ – ఇంటర్నెట్ లో ఫస్ట్ రివ్యూ – హిట్టా ఫట్టా ?
జవాన్ నాన్ థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రైట్స్ రూ. 250 కోట్లకు విక్రయించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ చరిత్రలో ఇదే అత్యధికం. అంతేకాకుండా ఈ చిత్ర తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ మెుత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్ రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా విడుదల కానుంది. ఈ మూవీ మ్యూజిక్ రైట్స్ ఏకంగా 36 కోట్లకు బాలీవుడ్ టీ సిరీస్ సొంతం చేసుకున్నట్టు సమాచారం. జవాన్ సినిమాను సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇదివరకటి రోజుల్లో థియేటర్ లో విడుదల టోన్ నిర్మాత కు డబ్బు వచ్చేది. కానీ ఈ డిజిటల్ యుగం లో OTT హక్కులు, మ్యూజిక్ హక్కులు, డబ్బింగ్ హక్కుల రూపంలో నిర్మాతకి బాగానే మిగులుతోంది సినిమా ఏ మాత్రం బాగున్నా సరే. హిట్ ఐన సినిమా కి ఈ ఆదాయం నిజంగా నిర్మాతలకు వరమే.