టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం `ఒకే ఒక జీవితం`. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు ఈ సినిమాను నిర్మించారు.
లాంగ్ గ్యాప్ తర్వాత అక్కినేని అమల ఈ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి.
దానికి తోడు చిత్ర టీమ్ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా విజయం ఇద్దరికి కీలకంగా మారింది. ఆ ఇద్దరూ మరెవరో కాదు.. శర్వానంద్, రితూ వర్మలే. అప్పుడెప్పుడో 2017తో వచ్చిన `శతమానంభవతి` తర్వాత శర్వానంద్ కు సరైన్ హిట్టే పడలేదు.
ఇటు రితూ వర్మ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ సైతం వరుస ఫ్లాపుల్లో మునిగిపోయింది. ఈమె నుంచి చివరిగా వచ్చిన `టక్ జగదీష్` ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే శర్వా, రితూ వర్మలు `ఒకే ఒక జీవితం`తో ఎలాగైనా హిట్ కొట్టాలని తెగ తాపత్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఆ ఇద్దరి కెరీర్ కు బూస్ట్ ఇస్తుందో..లేదో.. చూడాలి.