Entertainment News సినిమా

అవ‌కాశం వ‌స్తే అక్క‌డికి వెళ్లిపోతానంటున్న శ‌ర్వానంద్‌..!

Share

టాలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకపోయినా.. నటన మీద ఉన్న మక్కువతో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు శర్వానంద్. 19 ఏళ్లకే `ఐదో తారీఖు` సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. దాంతో కొన్నాళ్ళు సహాయక పాత్రలు పోషించిన శర్వానంద్.. `అమ్మ చెప్పింది` మూవీ తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

ఆ వెంటనే `గమ్యం`తో సూపర్ డూపర్ హిట్ అందుకుని హీరోగా నిలదొక్కుకున్నాడు. వైవిధ్యమైన కథలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన శర్వా గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయన నుంచి చివరగా వచ్చిన `ఆడవాళ్లు మీకు జోహార్లు` సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఇలాంటి తరుణంలో శర్వానంద్ కు `ఒకే ఒక జీవితం` రూపంలో మళ్లీ బిగ్ హిట్‌ వచ్చి పడింది. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించారు. అమలా అక్కినేని, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

oke oka jeevitham movie
oke oka jeevitham movie

ప్రముఖ దర్శక నటుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు. సెప్టెంబర్ 9న తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కు మదర్ సెంటిమెంట్ ను జోడించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శర్వానంద్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన `ఒకే ఒక జీవితం` సినిమా అందరికీ కనెక్ట్ అవ్వడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని శర్వానంద్ చెప్పుకొచ్చాడు.

ఒకవేళ తనకు అవకాశం వస్తే టైం మిషన్ ద్వారా ఇంటర్ కాలేజ్ డేస్‌ కి వెళ్ళిపోతానని శ‌ర్వా పేర్కొన్నాడు. ఆ స‌మ‌యంలో రేపటి గురించి ఆలోచన, నిన్నటి గురించి బాధ అంతగా ఉండదని, లైఫ్‌లో కాలేజ్ డేస్ ది బెస్ట్ అని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో తనకు గైడింగ్ ఫోర్స్ లేదని, ఒక ఫ్లాప్ రాగానే కొందరు హీరోల‌కు పెద్ద డైరెక్టర్ తో సినిమాలు సెట్ అవుతుంటాయ‌ని, కానీ తమక‌లా సెట్ చేసేవారు లేరని, మమ్మల్ని మేమే కాపాడుకోవాలని శర్వానంద్ పేర్కొన్నాడు. దీంతో ఈయ‌న కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.


Share

Related posts

దేవికి తన తండ్రిని పరిచయం చేసిన మాధవ్.. షాక్ లో రుక్మిణి, ఆదిత్య..! 

bharani jella

నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న నాని సినిమా..!!

sekhar

మెగా హీరో సినిమా నుంచి ఆ హీరోయిన్ ఔట్ ..?

GRK