శ్రీయ.. ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన శ్రీయ.. దాదాపు అగ్ర హీరోలందరి సరసన ఆడిపాడింది. అలాగే తమిళ్, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది.
కెరీర్ నెమ్మదిస్తున్న తరుణంలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను వివాహం చేసుకుంది.ఈ దంపతులకు లాక్డౌన్ సమయంలో పండంటి ఆడబిడ్డ జన్మించింది. కానీ మీడియాకు ఈ విషయం ఏమాత్రం లీక్ అవ్వకుండా జాగ్రత్త పడింది.
దాదాపు ఏడాది అనంతరం తన కూతురును అందరికీ పరిచయం చేసి ఆశ్చర్యపరిచింది. ఇక తల్లైన తర్వాత కూడా శ్రీయ కెరీర్‌ను కొనసాగుతోంది. ప్రస్తుతం ఈమె `దృశ్యం 2` లో అజయ్ దేవగన్ కు జోడిగా నటిస్తోంది. అలాగే సుదీప్ తో కలిసి ఓ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చేస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్లతో నెటిజన్లకు చెమటలు పట్టిస్తోంది. తాజాగా కూడా బ్లాక్ కలర్ షార్ట్ డ్రెస్‌ను ధరించి ఓ రేంజ్ లో అందాలు ఆరబోసింది. ఓ వైపు ఎద అందాలు, మరోవైపు థైస్ షోతో వేడి పుట్టించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీయ అందాల అరాచకం చూసి నెటిజన్లు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే శ్రీయ పెళ్లై, ఓ పిల్లకు తల్లంటే ఎవరూ నమ్మరని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/p/CjE9P3EvhB3/?utm_source=ig_web_copy_link