NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

Shruti Haasan: సీనియర్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత హీరోయిన్ గా నిలదొక్కుకుంది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. 2017 తర్వాత లండన్ కి చెందిన మైఖేల్ కోర్స్లే తో లవ్, బ్రేకప్ కారణంగా కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న శృతి హాస‌న్‌.. 2020లో మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది. రీ ఎంట్రీలో మునుపటి కంటే ఎక్కువ జోరు చూపిస్తూ బ్యాక్ అటూ బ్యాక్ హిట్స్ ను ఖాతాలో వేసుకుంటుంది.

ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా యాక్ట్ చేస్తూ మోస్ట్ బిజీ యాక్ట్రెస్ గా సత్తా చాటుతోంది. తెలుగులో ఈ బ్యూటీ ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ కు జోడిగా `స‌లార్‌ పార్ట్ 2` లో నటిస్తోంది. అలాగే అడివి శేష్ తో కలిసి `డాకోయిట్: ఎ లవ్ స్టోరీ` అనే మూవీ చేస్తోంది. ప్ర‌ముఖ‌ సినిమాటోగ్రాఫర్ షానెల్ డియో దర్శకత్వం వహిస్తున్న‌ యాక్షన్ డ్రామా చిత్రమిది. సుప్రియ యార్లగడ్డ మరియు సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు హాలీవుడ్ లో ఫిలిప్ జాన్ దర్శకత్వంలో `చెన్నై స్టోరీ` అనే రొమాంటిక్ కామెడీ మూవీకి శృతి హాస‌న్ కమిట్ అయింది. నిజానికి ఈ చిత్రంలో మొదట సమంతను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె కొన్ని కారణాల వల్ల తప్పుకోవడంతో శృతిహాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా శృతి హాసన్ తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తాను చాలా కాలం నుంచి పీసీఓఎస్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు వెల్లడించింది.

పీసీఓఎస్ కారణంగా తాను బ్యాడ్ పీరియడ్స్ సమస్యను ఫేస్ చేస్తున్నానని తెలిపింది. మొదటి పీరియ‌డ్ సమయం నుంచే అది పెద్ద పోరాటంగా మారిందని.. ఆ బాధను ఇప్పటికీ భరిస్తూనే జీవిస్తున్నానని శృతిహాసన్ చెప్పుకొచ్చారు. అలాగే బ్యాడ్ పీరియడ్ సమయంలో ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నానని.. ఒకవేళ షూటింగ్స్ ఉంటే త‌న భాద వ‌ర్ణ‌ణాతీత‌మ‌ని ఆమె పేర్కొంది. కాగా, పీసీఓఎస్ అనేది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. అండాశయాలు అసాధారణమైన ఆండ్రోజెన్‌లను ఉత్పత్తి చేసే పరిస్థితినే పీసీఓఎస్ అంటారు.

ఇటీవ‌ల కాలంలో చాలా మంది మ‌హిళ‌లు పీసీఓఎస్ బారిన ప‌డుతున్నారు. పీసీఓఎస్ హార్మోన్ల అసమతుల్యత, క్రమరహిత పీరియడ్స్, అదనపు ఆండ్రోజెన్ స్థాయిలు, అండాశయాలలో తిత్తులు కలిగిస్తుంది. గ‌ర్భం దాల్చ‌డాన్ని కష్టత‌రం చేస్తుంది. పీసీఓఎస్ ఉన్న ఎంద‌రో మ‌హిళ‌లు సంతాన‌లేమితో బాధ‌ప‌డుతున్నారు. ఇప్పుడు శృతి హాస‌న్ కూడా త‌న‌కు పీసీఓఎస్ ఉంద‌ని వెల్ల‌డించింది. దీంతో ఆమెకు పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా అంటూ అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts

శ్రీ ఎం ఆశ్రమంలో శ్రీ గురు మహావతార్ బాబాజీ ఆలయ గ్రాండ్ ఓపెనింగ్ 

Deepak Rajula

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N