బాల‌య్య మూవీకి బ్రేక్‌.. మెగాస్టార్ కోసం దిగిపోయిన శ్రుతిహాస‌న్‌!

Share

శ్రుతి హాస‌న్‌.. ఈ బ్యూటీ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ప్ర‌స్తుతం తెలుగులో ఈమె ఇద్ద‌రు సీనియ‌ర్ స్టార్ హీరోల‌తో న‌టిస్తోంది. వారిలో న‌టిసింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు కాగా.. మెగాస్టార్ చిరంజీవి మ‌రొక‌రు. బాల‌య్య‌తో ఈమె `ఎన్‌బీకే 107` మూవీ చేస్తోంది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది.

ఇప్ప‌టికే అర‌వై శాతం షూటింగ్ కంప్లీట్ అయింది. మిగిలిన భాగాన్ని కూడా మేక‌ర్స్ త్వ‌ర‌త్వ‌ర‌గా పూర్తి చేస్తున్న త‌రుణంలో బాల‌య్య క‌రోనా బారిన ప‌డ్డారు. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రికి కూడా క‌రోనా సోక‌గా.. ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ ప‌డింది. అయితే ఈ గ్యాప్‌లో శ్రుతి హాస‌న్ మెగాస్టార్ కోసం దిగిపోయింది.

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతి హాస‌న్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం `మెగా 154`. యంగ్ డైరెక్ట‌ర్ బాబీ తెర‌కెక్కిస్తున్న ఊర‌మాస్ చిత్ర‌మిది. `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ ఈ మూవీకి దాదాపు క‌న్ఫార్మ్ అయింది. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కానుంది.

ఇక‌పోతే ఈ మూవీ షూటింగ్ గ‌త కొద్ది రోజుల నుండీ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. నేటి నుండి శ్రుతి హాస‌న్ సైతం షూట్‌లో జాయిన్ అయింద‌ట‌. ప్ర‌స్తుతం చిరు, శ్రుతి హాస‌న్‌ల మ‌ధ్య కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నార‌ని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో మాస్ మ‌హారాజ్ ర‌వితేజ చిరంజీవికి త‌మ్ముడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌ర‌గుతోంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

36 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

44 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

4 hours ago