Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్ గురించి పరిచయాలు అవసరం లేదు. తనదైన అందం, అభినయం, అంతకు మించిన టాలెంట్‌తో అనతి కాలంలోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ.
మధ్యలో ప్రియుడితో బ్రేకప్ వల్ల సినిమాలపై దృష్టి సారించలేకపోయిన శ్రుతి హాసన్.. `క్రాక్`తో మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రభాస్‌కు జోడీగా `సలార్`, నందమూరి బాలకృష్ణ సరసన `ఎన్బీకే 107`తో పాటు మెగాస్టార్ చిరంజీవితో కలిసి `మెగా 154`లో నటిస్తోంది. ఇక ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా.. శ్రుతి హాసన్ సోషల్ మీడియాను మాత్రం వదిలిపెట్టదు.
ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని షేర్ చేస్తూ ఫాలోవర్స్‌ను సంపాదించుకుంటూ పోతుంది. అయితే తాజాగా ఓ వర్కవుట్ వీడియోను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు తనకు ఉన్న అనారోగ్య సమస్యల గురించి వివరించింది. `ప్రస్తుతం నేను కొన్ని చెత్త హార్మోన్ల సమస్యల్ని(PCOS & endometriosis) ఎందుర్కొంటున్నా. వీటి నుంచి బయటపడేందుకు పోరాడుతున్నా. ఈ విషయంలో మానసికంగా నేను చాలా దృఢంగా ఉన్నా. హార్మోనల్ ఇమ్బ్యాలెన్స్ వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారో ప్రతి మహిళకు తెలుసు.
అయితే నేను దీని గురించి చింతించడం లేదు. ఈ సమస్యల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా. ఇందు కోసం సమయానికి తినడం, సరిపడ నిద్రపోవడంతో పాటు ప్రతి రోజూ వ్యాయమం చేస్తున్నా. అందరు ఇలాంటి సమస్యలను బయటకు చెప్పేందుకు సంకోచిస్తుంటారు. కానీ, ఇలాంటి సమస్యలు జీవితానికి విసిరే సవాళ్లు. వాటిని ధైర్యంగా స్వీకరించాలి. ఎందుకంటే ఇవి మన జీవితాన్ని డిఫైన్ చేయకూడదు. అందుకే నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవాలనుకున్నా` అంటూ శ్రుతి హాసన్ పేర్కోంది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది.
https://www.instagram.com/reel/CfYo9GahDly/?utm_source=ig_web_copy_link
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…