`మహానటి` అనంతరం మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ డైరెక్టుగా తెలుగులో చేసిన చిత్రం `సీతారామం`. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. రష్మిక, సుమంత్, తరుణ్ భాస్కర్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
హై బడ్జెట్ తో బడా నిర్మాత అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమాను హిందీలోనూ విడుదల చేయగా అక్కడ సైతం సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఓటీటీ లో ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభించిందో ప్రత్యేకంగా వివరించాల్సిన పనిలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలోని ఓ డిలీటెడ్ సీన్ తాజాగా మేకర్స్ బయటకు వదిలారు. పాకిస్తాన్ ఆర్మీ చేతిలో బందీగా చిక్కుకున్న దుల్కర్ సల్మాన్, సుమంత్‌ల మధ్య చిత్రీకరించిన సన్నివేశం ఇది. పాకిస్తాన్ మేజర్ అబు తారీఖ్.. రామ్, విష్ణుశర్మలను బయటకు తీసుకొస్తారు. అక్కడ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ వీరిద్దరూ ఫుట్‌బాల్ ఆడతారు. ఆట పూర్తయిన వెంటనే `విష్ణు సార్ మళ్లీ మీరే గెలిచారు` అని రామ్ అంటాడు.
దాంతో కోపంతో విష్ణుశర్మ రామ్ కాలర్ పట్టుకుని `అంతా నీ వల్లే జరిగింది నువ్వు అనాధవురా.. నాకు పుట్టింది ఆడపిల్లో, మగ పిల్లవాడో కూడా తెలియడం లేదు` అంటూ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. దాంతో రామ్ ఎంతగానో బాధపడతాడు. కన్నీళ్లు తెప్పిస్తున్న ఈ డిలీటెడ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సినిమా నడివి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సీన్‌ను డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.