33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
Entertainment News సినిమా

`సీతారామం` డిలీటెడ్ సీన్.. వివాదం అవుతుంద‌నే తొల‌గించారా?

Share

సీతారామం.. గ‌త నెల‌లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో ఒక‌టి. మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా చేసిన రెండో చిత్ర‌మిది. ఇందులో మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్‌గా న‌టిస్తే.. రష్మిక మందన్న, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

యుద్ధ నేప‌థ్యంలో సాగే ప్రేమ కావ్యమిది. దేశాన్ని ప్రాణం కంటే ఎక్కువ‌గా ప్రేమించే ఓ సైనికుడికి, దేశ‌మంత ప్రేమ‌ని ఆ సైనికుడిపై ధార‌బోసే ఓ అమ్మాయికీ మ‌ధ్య సాగే ఈ మూవీని డైరెక్ట‌ర్‌ హ‌ను రాఘవపూడి తెర‌కెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు. ఆగ‌స్టు 5న తెలుగుతో మ‌ల‌యాళ‌, త‌మిళ భాష‌ల్లోనూ విడుద‌లైన ఈ మూవీ.. అన్ని భాష‌ల్లోనూ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

రీసెంట్‌గా హిందీలో ఈ మూవీని విడుద‌ల చేయ‌గా.. అక్క‌డ సైతం సూప‌ర్ హిట్ టాక్‌తో అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబ‌డుతోంది. ఇక‌పోతే తాజాగా ఈ మూవీ డిలీటెడ్ సీన్ ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మూవీలో అఫ్రీన్ పాత్రలో నటించిన రష్మిక మందన్నకు సంబంధించి సీన్ ఇది. ఇందులో ఈ వీడియోలో రష్మిక టాక్సీలో నూర్జహాన్ మహిళా కళాశాలకు వెళ్ల‌డాన్ని చూపించారు.

అయితే టాక్సీ లోనే బ్యాగ్ ని మర్చిపోయాన‌ని గుర్తు చేసుకుని.. మ‌ళ్లీ బ‌య‌ట‌కు వ‌స్తుంది ర‌ష్మిక‌. అక్క‌డే టాక్సీ డ్రైవర్ ఉండ‌టంతో `ఓ ఇంకా ఇక్కడే ఉన్నావా!.. పరవాలేదు ఇండియాలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట` అంటూ ఇండియన్స్ దొంగలు అన్నట్టుగా తప్పుగా మాట్లాడుతుంది. దానికి టాక్సీ డ్రైవర్ `ఇక్కడ అందరూ నాలాంటోళ్ళే ఉంటారు మేడం.. మీ బ్యాగ్ తీసుకుపోయి మా దేశం పరువు మీతో పంపలేనుగా మేడం` అంటూ బ‌దులిస్తాడు. ఆక‌ట్టుకునే విధంగా ఉన్న ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే ర‌ష్మిక డైలాగ్స్ వివాదానికి తెర‌లేపే విధంగా ఉన్నాయి. అందుకు ఈ వీడియోను సినిమా నుంచి తొల‌గించార‌ని టాక్‌.


Share

Related posts

Unstoppable Show: బాల‌య్య టాక్‌ షోకి ఎన్టీఆర్ రాక‌పోవ‌డం వెన‌కున్న టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా?

kavya N

Prabhas: ప్రభాస్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న ఆ టాప్ హీరోయిన్..??

sekhar

బ‌న్ని సినిమాలో ట‌బు లుక్ ఇదే!

Siva Prasad