`మహానటి` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా చేసిన చిత్రం `సీతా రామం`. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించాడు. ఇందులో దుల్కర్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది.అలాగే రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భుమిక చావ్లా, గౌతం వాసుదేవ్ మీనన్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇదో క్లాసిక్ అంటూ ఈ మూవీని అభివర్ణిస్తున్నారు. సినీ సెలబ్రెటీలు సైతం ఈ సినిమా పాజిటివ్ రివ్యూలు ఇస్తుండటంతో.. బాక్సాఫీస్ వద్ద `సీతా రామం` అదిరిపోయే కలెక్షన్స్ ను రాబడుతోంది. మూడో రోజు సండే కావడం ఈ సినిమాకు మరింత కలిసొచ్చింది.
తొలి రెండు రోజుల కంటే ఎక్కువ వసూళ్లను మూడో రోజు వసూల్ చేసి బీభత్సం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ.1.50 కోట్లు, రెండో రోజు రూ. 2.08 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం.. మూడో రోజు రూ. 2.62 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 4.47 కోట్ల షేర్‌ను వసూల్ చేసింది. ఇక ఏరియాల వారీగా `సీతారామం` ఫస్ట్ వీకెండ్ టోటల్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే..
నిజాం: 2.54 కోట్లు
సీడెడ్: 0.65 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.85 కోట్లు
తూర్పు: 0.56 కోట్లు
పశ్చిమ: 0.40 కోట్లు
గుంటూరు: 0.47 కోట్లు
కృష్ణ: 0.50 కోట్లు
నెల్లూరు: 0.23 కోట్లు
———————————
ఏపీ+తెలంగాణ= 6.20కోట్లు(11.65 కోట్లు~ గ్రాస్)
———————————
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా- 0.60 కోట్లు
ఇతర భాషలు – 1.55 కోట్లు
ఓవర్సీస్- 2.80 కోట్లు
————————————
టోటల్ వరల్డ్ వైడ్ = 11.15కోట్లు(22.20 కోట్లు~ గ్రాస్)
————————————
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 18.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 19.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. ఇప్పుడు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే ఫస్ట్ వీకెండ్ వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 8.35 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంది. లాంగ్ రన్లో దుల్కర్ ఈ టార్గెట్‌ను ఈజీగా అందుకోవడం ఖాయమని అంటున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!