మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో డైరెక్ట్‌గా చేస్తున్న చిత్రం `సీతా రామం`. ప్రేమకథల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, సుమంత్, తరుణ్ భాస్కర్, భూమిక, గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
కాశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఓ ఒంటరి సైనికుడికి.. ఓ యువతికి మధ్య నడిచే 1965 నాటి అందమైన ప్రేమ కథా చిత్రమిది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ రేపు తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా.. మేకర్స్ ప్రచార కార్యక్రమాలతో మరింత హైప్‌ను పెంచేశారు. దీంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. మలయాళ హీరో అయినప్పటికీ.. దుల్కర్ ఇక్కడ మాస్ బిజినెస్ చేశాడు. `సీతా రామం` టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఓ సారి గమనిస్తే..
నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
ఆంధ్రా – 7 కోట్లు
————————–
ఏపీ+తెలంగాణ= 14.00 కోట్లు
————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 0.70 కోట్లు
ఓవర్సీస్ – 2.5 కోట్లు
ఇతర భాషలు – 1.50 కోట్లు
—————————————-
వరల్డ్ వైడ్ బిజినెస్= 18.70 కోట్లు
—————————————-
కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 18.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్‌గా నిలవాలంటే రూ. 19.50 కోట్ల షేర్‌ను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇంత పెద్ద టార్గెట్‌ను దుల్కర్ రీచ్ అవుతాడో..లేదో..చూడాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!