Sita Ramam Teaser: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన ఓ తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు `అందాల రాక్షసి` ఫేమ్ హను రాఘవపూడి. హను రాఘవపూడి, దుల్కర్ సల్మాన్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `సీతారామం`.
ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కీలక పాత్రను పోషిస్తోంది. ఓ అందమైన ప్రేమకావ్యంగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని.. ఆగస్టు 5న మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే తాజాగా `సీతారామం` టీజర్‌ను బయటకు వదిలారు మేకర్స్. `లెఫ్టినెంట్ రామ్! నిన్నే నాకు పరిచయమైన పేరు. కశ్మీర్ కొండల్లో పహారా కాస్తున్న ఒక ఒంటరి సైనికుడు. తనకు మాట్లాడటానికి ఒక కుటుంబం. కనీసం ఉత్తరం రాయడానికి ఒక పరిచయం కూడా లేదన్న విషయం నిన్నే నాకు తెలిసింది` అని నేపథ్యంలో నటి రోహిణి మాటలు వినిపిస్తుంటే.. స్క్రీన్ మీద రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్‌ను పరిచయం చేశారు.
ఎవరూ లేని రామ్‌కి అన్నీ తానే కావాలని అనుకుంటుంది హీరోయిన్. అతడికి `నీ భార్య సీతా మహాలక్ష్మి` పేరుతో ప్రేమలేఖలు రాయడం మొదలుపెడుతుంది. సీత… ఎవరా? అంటూ ఆమె గురించి ఆలోచించడం మొదలుపెడతాడు హీరో. అక్కడితో టీజర్ పూర్తైంది. అథ్యంతం ఆకట్టుకుంటున్న ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా అలరిస్తోంది. మరి ఇంతకీ ఈ సీతారాముల కథ తెలియాలంటే ఆగస్టు 5వ తేదీ వరకు ఆగాల్సిందే.