సోనాల్ చౌహాన్.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అవసరం లేదు. `లెజెండ్` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన సోనాల్.. ఆ తర్వాత `పండగ చేస్కో`, `సైజ్ జీరో` తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఇవేమీ ఆమెకు ఇక్కడ స్టార్ ఇమేజ్ ను అందించలేకపోయాయి.
రీసెంట్గా విడుదలైన సూపర్ హిట్ మూవీ `ఎఫ్ 3`లోనూ ఈ బ్యూటీ మెరిసింది. ఇక తాజాగా `ది ఘోస్ట్` మూవీతో సోనాల్ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అక్కినేని నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. అక్టోబర్ 5 విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది.
ఇందులో సోనాల్ అందమైన ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపించడమే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంగతి పక్కన పెడితే సోనాల్ చౌహాన్ తాజా ఫోటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది.
దసరా పండుగ సందర్భంగా ఈ బ్యూటీ లెహంగా చోళీ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ధగధగ లాడుతూ దర్శనమిచ్చింది. ఈమె తాజా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోనాల్ అందాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఏదేమైనా సోనాల్ లేటెస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరు. అంత అందంగా ఆమె కనిపిస్తోంది.