యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ సినిమాతో కెరీర్ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. గత ఏడాది విడుదలైన `పెళ్లి సందడి` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా శ్రీలీల మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.
ఆమె అందచందాలకు కుర్రకారు ఫిదా అయిపోయింది. ఒక్క సినిమాతో శ్రీలీల భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీల మాస్ మహారాజ్ రవితేజకి జోడిగా `ధమాకా`, నితిన్ సరసన `జూనియర్`, నవీన్ పోలిశెట్టి తో `అనగనగా ఒక రాజు` అనే చిత్రాలు చేస్తోంది.
అలాగే నటి సింహం నందమూరి బాలకృష్ణకు కూతురుగా `ఎన్బీకే 108` చిత్రంలోనూ నటించబోతోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ఈ బ్యూటీ మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అంత చందాలతో ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతుంది.
తాజాగా కూడా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఆరెంజ్ పండు మాదిరి అందంగా మెరిసిపోతూ దర్శనం ఇచ్చింది. హాఫ్ శారీని పోలిన ట్రెడిషనల్ పార్టీ వేర్ లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ చేసింది.
ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. శ్రీ లీల అందాల దాడికి తట్టుకోలేక నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అబ్బబ్బా ఏమి అందంరా బాబు అంటూ తల పట్టుకుంటున్నారు. మొత్తానికి మరోసారి తన అందాలతో శ్రీలీలా సోషల్ మీడియాను హీటెక్కించింది.
https://newsorbit.com/cinema/actress-sreeleela-hikes-her-remuneration.html
Big Boss Vasanthi: పెళ్లి తర్వాత గ్లామర్ డోస్ మరింత పెంచిన వాసంతి.. ఆ పార్ట్ చూపిస్తూ ఎక్స్పోజింగ్..!