మెగాస్టార్ చిరంజీవి హాట్ అంటూ బుల్లితెర స్టార్ యాంకర్ శ్రీముఖి హాట్ కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి త్వరలో `గాడ్ ఫాదర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ `లూసిఫర్`కు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్వకత్వం వహించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, పూరీ జగన్నాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న ఈ మూవీ విడుదల కానుంది.

ఈ నేపథ్యంలోనే రీసెంట్‌గా చిరు `నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు` అంటూ చిరు వదిలిన డైలాగ్ ఎంతలా ట్రెండ్ అవుతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఒక డైలాగ్‌లో మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశారు. మరోవైపు మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ప్రైవేటు జెట్‌లో ఇంటర్వ్యూను ప్లాన్ చేశారు.
ఇందులో చిరును శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోను తాజాగా బయటకు వదిలారు. ఇందులో `ఐ లవ్యూ చిరంజీవి గారు.. ఈ లుక్‌లో మీరు చాలా హాట్‌గా ఉన్నారు..మిమ్మల్ని చూసి తట్టుకోలేపోతున్నాను` అంటూ శ్రీముఖి ఓపెన్‌గానే బోల్డ్ కామెంట్స్ చేసింది. శ్రీముఖి అంత మాట అనేసరికి.. చిరు సిగ్గు మొగ్గలేసింది. ఇక ఈ ప్రోమోలో చిరు సల్మాన్ ఖాన్, పూరీ జగన్నాథ్, తమన్ గురించి కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం మేరక్స్ వదిలిన తాజా ప్రోమో నెట్టింట వైరల్‌గా మారింది.