Sridevi Drama Company ఆగస్టు 16: బుల్లితెర అభిమానులకు సీరియల్ చేసే నటులంటే చాలా ఇష్టం ఉంటుంది. వాళ్లని కూడా హీరోలతో సమానంగా చూస్తారు. నెలకు ఒకసారి థియేటర్ కి వెళ్లి చూసే సినిమా కంటే రోజు టీవీలో కనిపించే చిన్న చిన్న సీరియల్స్, షోలమీదే ఎక్కువమంది అభిమానాన్ని పెంచుకుంటూ ఉంటారు. అలా అభిమానం పెంచుకొని వాళ్ళని రియల్ హీరో లాగా ఫీల్ అవుతుంటారు అభిమానులు. బుల్లితెరపై ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కార్యక్రమాల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి. ప్రతి ఆదివారం ప్రసారం కాబోయే ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర హీరోలు,హీరోయిన్లు కూడా సందడి చేస్తారు. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమో వచ్చింది. సీరియల్ నటులు అర్జున్ అంబటి, బ్రహ్మముడికి లో చేసే మానస్ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టుగా ఈ ప్రోమో ఉంది. అసలు ఈ ప్రోమోలో ఏముందో చూద్దాం..

తాజా ప్రోమోలో హైపర్ ఆది స్టేజ్ మీద తన లవర్ ని పరిచయం చేస్తాడు. ఇప్పటివరకు కంటెంట్ కోసం లైన్ వేయడం లాంటివి చేశారు ఇప్పుడు నిజంగానే లవ్ చేసిన ఒక అమ్మాయి ఉందని ఆ అమ్మాయి బేబీ అని తన స్టేజ్ మీదకు తీసుకురావడం ఇవన్నీ చూపిస్తారు ప్రోమోలో, ఎప్పటిలాగానే ఓవరాక్షన్స్ తో ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం వేనకాల లవ్ సాంగ్ వేయడం పైన లవ్ సింబల్ వేయడం ఇలా ప్రోమో అంత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడే అసలైన స్టంట్ వచ్చేస్తుంది అదే హైపర్ ఆది అందరి దగ్గర ఫోన్లు తీసుకొని బల్ల మీద పెట్టి రష్మీ కళ్ళ గంతలు కడతాడు రేష్మి ఎవరి ఫోన్ ముట్టుకుంటుందో వాళ్ల సీక్రెట్ లన్నీ బయట పెట్టేస్తాం అని ఆది చెప్తాడు దీంతో ఫస్ట్ రష్మీ తన ఫోనే తీసుకుంటుంది. అప్పుడు ఆది తన ఫోన్ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించమని అడుగుతాడు వామ్మో అన్నట్లు ఎక్స్ప్రెషన్లు దేవత సీరియల్ ఫ్రేమ్ అర్జున్ అంబటి ఫోన్ తీస్తుంది తర్వాత రష్మీ.

ఆయన ఫోన్ ఓపెన్ చేయకు చాలా సీక్రెట్ లు ఉంటాయి అని అంటాడు మానస్, పెళ్లైన వాడిని నా ఫోన్లో ఏముంటుంది రా నీ ఫోన్లో ఉంటాయి సీక్రెట్ లన్ని అని మానస్ కి అర్జున్ కౌంటర్ ఇస్తాడు. కట్ చేస్తే మానస్,అర్జున్ తో నువ్వు నన్ను అనవసరంగా గెలుకుతున్నావ్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అంటూ వాయిస్ రేజ్ చేస్తారు. పేమెంట్ ఇచ్చింది ఎందుకు పంచులు వేయడానికి కదా, అట్లాగని ఏది పడితే అది మాట్లాడతావా అని మానేస్తాడు ఇక ఇద్దరి మధ్య మాటక మాట పెరిగిపోయి స్టేజ్ మీద ఒకరికొకరు తోసుకోవడం తన్నుకోవడం అటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి.

అర్జున్ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీకు తగులుతాయి అంటూ అనడం రారా చూసుకుందాం అని మానస్ అనడంతో ప్రోమో ముగుస్తుంది. అయితే వీళ్ళిద్దరి నిజంగా గొడవ పడ్డారా లేకపోతే ఎపిసోడ్ హైలైట్ కోసం ఇలా ప్రోమో వేశారా అన్నది తెలియాలంటే ఈ వీడియో మొత్తం ప్లే అయ్యేవరకు మనం ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ ప్రోమో వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.