33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Srikanth Daughter: శ్రీకాంత్ కూతురు ఎంత అందంగా ఉందో.. హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు!

Share

Srikanth Daughter: సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కర్ణాటక రాష్ట్రంలో జ‌న్మించిన ఈయ‌న‌.. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రైండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన శ్రీ‌కాంత్‌.. ప్ర‌స్తుతం విల‌న్ మ‌రియు స‌హాయ పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.

ఇక‌పోతే శ్రీ‌కాంత్ సహచర నటి, హీరోయిన్ ఊహ అలియాస్ శివరంజని అలియాస్ ఉమ‌ని పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్దరిది ప్రేమ వివాహం. శ్రీ‌కాంత్, ఊహలు కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు. ఆ స‌మయంలో వీరిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డ‌గా.. ఆపై పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

ఈ దంప‌తుల‌కు రోషన్, మేధా, రోహన్ అనే ముగ్గురు పిల్ల‌లు జ‌న్మించారు. వీరిలో ఇప్ప‌టికే రోష‌న్ హీరో ఎంట్రీ ఇచ్చాడు. అలాగే కూతురు మేధా కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతోందని ఎప్ప‌టి నుంచో వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా శ్రీకాంత్ కుటుంభ‌స‌మేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం బయటకు వచ్చిన వీరితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే ఎరుపురంగు లంగావోణీలో మేధ ఎంతో అందంగా మెరిసిపోయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుండ‌టంతో.. మేధ‌ను చూసి నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని అందం మేధ సొంత‌మంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, ఆమె త్వ‌ర‌గా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు.

 


Share

Related posts

Pawan Kalyan: పవన్ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలను ఖండించిన హరీష్ శంకర్..??

sekhar

Sunil: కన్‌ఫ్యూజన్‌గా సాగుతున్న సునీల్ కెరీర్..రామ్ చరణ్ – శంకర్ సినిమాతోనైనా సెట్ అవుతుందా..?

GRK

ఉప్పెన సినిమాని ఎలాంటి రోజు రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ అవుతుందో అలాంటి డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ ..?

GRK