టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు గత కొంత కాలం నుంచి బ్యాడ్ టైం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. ఇలాంటి తరుణంలో `లైగర్` మూవీతో అయినా హిట్టు కొట్టాలని విజయ్ భావించాడు. పైగా ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ మూవీపై ఎన్నో ఆశలు కూడా పెట్టుకున్నాడు.
కానీ విజయ్ దేవరకొండ ఆశలన్నీ నిరాశ అయ్యాయి. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదల అయింది. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా ఫ్లాప్ అవడంతో విజయ్ దేవరకొండకు తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడట.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. రీసెంట్ గా ఈయన `పుష్ప` మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈయన బన్నీతో `పుష్ప 2` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఓ మూవీ రావాల్సి ఉన్న సంగతి తెలిసిందే
ఈ ప్రాజెక్ట్ ను అటు విజయ్, ఇటు సుకుమార్ ఇద్దరూ కన్ఫామ్ చేశారు. పుష్ప 2 అనంతరం వీరి కాంబో ప్రాజెక్టు ఉంటుందని అందరూ భావించారు. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో సుకుమార్ విజయ్ తో సినిమా చేసేందుకు వెనక్కి తగ్గుతున్నాడని, వీరిద్దరి ప్రాజెక్ట్ ఆగిపోయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడీ ప్రచారంపై విజయ్ ఫ్యాన్స్ తెగ వర్రీ అయిపోతున్నారు.
https://newsorbit.com/cinema/vijay-devarakonda-fans-new-demand.html