Krishna: తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయనతో ప్రత్యేక స్థానం.. కేవలం నటనా సామర్థ్యం తోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమకు తొలిసారిగా ఆయన చేసిన పరిచయాలు చాలా ఎక్కువ.. కొన్ని పాత్రలకు ఆయన ఎలా జీవం పోసారంటే.. ఆ పాత్రలు గుర్తుకు చేసుకుంటేనే కృష్ణ గుర్తుకు వస్తారు. అల్లూరి సీతారామరాజు, జేమ్స్ బాండ్ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది కృష్ణ నటనే.. మొదటి స్కోప్ సినిమా.. తొలి స్టీరియో ఫోనిక్స్ సౌండ్ సినిమా.. తొలి 70 MM సినిమా.. ఈ మూడు ఆయన పరిచయం చేసినవే.. తొలి ఈస్ట్ మాన్ కలర్ సినిమా గా కృష్ణ పరిచయం చేసినవి ఎన్నో.. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది..!
సూపర్ స్టార్ కృష్ణ మన నుండి దూరమై రెండు రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఘట్టమనేని కుటుంబం కూడా ఇంకా ఆ బాధతత్ప హృదయంతో ఆవేదన చెందుతున్నారు అయితే ఆ మహానటుడిసినీ జీవితంలో పలు పదిలమైన జ్ఞాపకాలను ఇకపై ప్రేక్షక అభిమానుల ముందుకు తీసుకువచ్చేలాగా ఆయన కుటుంబం ఒక బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..
అతి త్వరలో కృష్ణ గారి మెమోరియల్ ని హైదరాబాదులో ఏర్పాటు చేసేందుకు వారు సిద్ధమవుతున్నారు. ఆ మెమోరియల్ లో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహంతో పాటు, ఆయన సినీ జీవితానికి సినిమాలకు సంబంధించిన పలు ఫోటోలు షీల్డ్ అని అందులో ప్రేక్షక అభిమానుల యొక్క సందర్శనార్థం కోసం ఏర్పాటు చేయనున్నారు. అయితే కొద్దిసేపటికి క్రితం కృష్ణ గారి మెమోరియల్ కి సంబంధించిన వార్తకు బయటకు రాగా దీని గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ విషయం తెలిసిన సూపర్ స్టార్ అభిమానులు వాటినే మళ్ళీ ఆయన్ని చూసుకోవచ్చు అనుకుంటున్నారు.