కేంద్ర ప్రభుత్వం 68వ జాతీయ సినిమా అవార్డులను కొద్ది సేపటి క్రితమే అధికారికంగా ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈసారి మొత్తం 400 సినిమాల మధ్య పోటీ నడవగా.. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు పురస్కారాలు వరించాయి.
అయితే జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తమిళ చిత్రం `సూరారై పోట్రు(తెలుగులో ఆకాశం నీ హద్దురా)` ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు అవార్డ్స్‌ను కొల్లగొట్టి సత్తా చాటింది. ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాధ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం సుధ కొంగర దర్శకత్వం వహించారు.
జాతీయ అవార్డుల్లో టాలీవుడ్‌కు దక్కినవి ఎన్నో తెలుసా?
2డి ఎంటర్టైన్మెంట్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో సూర్య, అపర్ణ బాలమురళి జంటగా నటించారు. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా హిట్‌గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమాకు జాతీయ అవార్డుల పంట పడింది. ఈ మూవీ ఐదు ప్రతిష్టాత్మక విభాగాల్లో అవార్డులు గెలుపొందింది.
`సూరారై పోట్రు 68వ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. అలాగే ఇందులో గోపినాథ్ పాత్రలో కనిపించిన సూర్య జాతీయ ఉత్తమ నటుడిగా, ఆయనకు జోడీగా చేసిన అపర్ణ బాలమురళి జాతీయ ఉత్తమ నటిగా, సంగీతం అందించిన జీవీ ప్రకాశ్ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. వీరితో పాటు ఉత్తమ స్క్రీన్‌ప్లే కింద సుధా కొంగర, షాలిని ఉషాదేవిలు అవార్డును కైవసం చేసుకున్నారు. అయితే సూర్య బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్‌తో కలిసి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకోబోతున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!