32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News

ఖరీదైన కారులో షికారుకి వెళ్తే ఆ మజానే వేరు, మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్ కొత్త కారు విలువు తెలిస్తే కంగుతింటారు!

Sushmita Sen buys new car after shelling out huge cash check details మెర్సిడెజ్ జీఎల్‌ఈ 53 ఏఎంజీ కొప్
Share

Sushmita Sen: బాలీవుడ్ బ్యూటీ, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1994లో విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ అందాల తార బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. ‘సోనియా.. సోనియా.. స్వీటు స్వీటు సోనియా’ అంటూ ‘రక్షకుడు’ సినిమాలో కింగ్ నాగార్జున సరసన నటించి టాలీవుడ్‌లో సందడి చేసింది. అలాగే యాక్షన్ కింగ్ అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల సినిమాల్లో హీరోయిన్‌గా నటించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. వయసు పైబడటంతో సినిమాలకు కాస్త దూరంగానే ఉన్నా.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. తన డైలీ అప్‌డేట్స్, సెలబ్రెషన్స్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటారు.

లలిత్ మోదీతో ప్రేమాయణం..
ఈ మధ్యకాలంలో ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణం నడిపింది. అప్పట్లో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ వయసులో ప్రేమేంటంటూ.. చాలా మంది నెటిజన్లు కామెంట్లు కూడా పెట్టారు. కానీ ప్రేమకు వయసుతో సంబంధం లేదని సుస్మితా రీకౌంటర్ ఇచ్చింది.

Sushmita Sen buys new car after shelling out huge cash, check details. మెర్సిడెజ్ జీఎల్‌ఈ 53 ఏఎంజీ కొప్.
Sushmita Sen buys new car after shelling out huge cash, check details. మెర్సిడెజ్ జీఎల్‌ఈ 53 ఏఎంజీ కొప్.

మెర్సిడెజ్ జీఎల్‌ఈ 53 ఏఎంజీ కొప్..
సుస్మితా సేన్ తాజాగా మెర్సిడెజ్ జీఎల్‌ఈ 53 ఏఎంజీ కొప్ అనే బెంజ్ కారును కొన్నది. ఈ కారు బ్లాక్ కలర్‌లో, అదిరిపోయే లుక్‌లో ఉంది. డ్రైవింగ్ అంటే తనకు ఇష్టమని, అందుకే తనకు తానే కారును గిఫ్ట్ ఇచ్చుకుంటున్నట్లు సుస్మితా సేన్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే, ఈ కారు ధర తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. రూ.1.92 కోట్లకు మెర్సిడెజ్‌ బెంజ్‌ను కొనుగోలు చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Netflix: వరల్డ్ నెంబర్ వన్ OTT.. “నెట్ ఫ్లిక్స్” అసలు చరిత్ర తెలుసా..?

సీరియల్, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ..
నాలుగు పదుల వయసులోనూ సినిమాలు, సీరియల్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు సుస్మితా సేన్. ప్రస్తుతం ఆమె ‘ఆర్య-3’ సీరియల్‌లో నటిస్తున్నారు. రామ్ మాధ్వాని దర్శకత్వంలో వస్తున్న ఈ ధారావాహికలో మనీష్ చౌదరి, సికందర్ ఖేర్, నమిత్ దాస్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ‘తాళి’ అనే కొత్త వెబ్ సిరీస్‌లో కూడా సుస్మితా సేన్ నటించారు.

Nithya Menon: ఆ హీరో ప్రతిసారి పెళ్లి చేసుకోమనేవాడు నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు..!!


Share

Related posts

ప్ర‌ముఖ ఓటీటీకి ర‌వితేజ `రామారావు`.. ఎన్ని కోట్లు ప‌లికిందంటే?

kavya N

Pushpa: రష్యా బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన ఐకాన్ స్టార్ బన్నీ..!!

sekhar

Ram Charan-Upasana: పెళ్లి రోజు వేడ‌క‌ల్లో రామ్ చ‌ర‌ణ్ దంప‌తులు.. వైర‌ల్‌గా మారిన ఫోటోలు!

kavya N