మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 15 ఏళ్ళు అయిపోయిన ఇంకా తన ఫామ్ ను కోల్పోకుండా కెరీర్ లో సక్సెస్ ఫుల్గా రాణిస్తోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ `బబ్లీ బౌన్సర్` మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతోంది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.
ప్రముఖ ఓటీటీ సమస్త డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ చిత్రం సెప్టెంబర్ 23న డైరెక్ట్ గా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే ఆమెకు పెళ్లిపై ప్రశ్నలు ఎదురయ్యాయి. వాస్తవానికి మూడు పదుల వయసొచ్చిన తమన్నా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఇప్పటికే ఈమె పెళ్లి గురించి ఎన్నో సార్లు రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో ఇప్పటివరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదో స్పష్టం చేసింది.
తమన్నా మాట్లాడుతూ..`నా పెళ్లి విషయంలో ఇప్పటివరకు ఎవరి నుండి ఒత్తిడి రాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు, పెళ్లి గురించి ఆలోచనా చేయలేదు. ఒకవేళ పెళ్లి టైం వస్తే కనుక హ్యాపీగా చేసుకుంటాను` అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
https://www.instagram.com/tv/CiHy5o3D4Pj/?utm_source=ig_web_copy_link
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!