33.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
Entertainment News ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ సినిమా

YS Jagan: వైయస్ జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచేత్తిన తమ్మారెడ్డి భరద్వాజ..!!

Share

YS Jagan: తమిళ హీరో ధనుష్ హీరోగా “సార్” సినిమా ఇటీవల రిలీజ్ కావటం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో జరిగేకిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్. చదువు ప్రధాన లక్ష్యంగా చేసిన ఈ సినిమా చాలామందిని ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల మాట్లాడుతూ వైయస్ జగన్ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచేత్తారు. ధనుష్ సార్ సినిమా చూస్తున్నంత సేపు నాకు వైయస్ జగన్ ప్రభుత్వం గుర్తొచ్చింది. విద్యా వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన మార్పులు.. ఎంతగానో కట్టిపడేసాయి. ఆ రీతిగానే సినిమాలో స్టోరీ ఉండటం జరిగింది. వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక పనికొచ్చే చదువు విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్నారు.

Tammareddy Bharadwaj praised YS Jagan government

గతంలో ప్రవేట్ కాలేజీల పేరిట.. విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర భారీ ఎత్తున ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండేది. ఆ సమయంలో గవర్నమెంట్ విద్యాసంస్థలే ప్రమాదంలో పడిన ఘటనలు కూడా కనిపించాయి. మనం కట్టే పన్ను గవర్నమెంట్ హాస్పిటల్స్ మరియు విద్యాసంస్థలకే ఉపయోగపడేలా ఉంటాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏపీలో ఉంది. విద్యా మరియు వైద్యం విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చాలా హైలెట్ అవుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నేతలు జెడి లక్ష్మీనారాయణ, జయప్రకాష్ నారాయణ లాంటి వారు కూడా.. కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొన్ని మెడికల్ కాలేజీ లతోపాటు విలేజ్ క్లినిక్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వ్యాఖ్యానించారు. నిజంగా ఆ రీతిగా వైద్యం అందితే… చాలా సంతోషించదగ్గ విషయమని కొనియాడారు. దీంతో తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవి బాధ్యతలు చేపట్టాక దాదాపు 50 వేల కోట్లకు పైగా అనే విద్య విషయంలో ఖర్చు చేస్తూ ఉన్నారు.

Tammareddy Bharadwaj praised YS Jagan government

మనిషి తలరాతను మార్చేది విద్య అని తాను బలంగా నమ్ముతానని చాలా సందర్భాలలో సీఎం జగన్ చెప్పటం జరిగింది. ఇది భవిష్యత్తుకు సంబంధించి విద్యార్థుల జీవితంలో పెట్టే పెట్టుబడి అని కూడా అన్నారు. ఇంకా నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారు. అమ్మ ఒడి అనే పథకంతో… ఆర్థికంగా విద్యార్థుల తల్లిదండ్రులను ఆదుకుంటున్నారు. జగనన్న గోరుముద్ద వంటి పథకం ద్వారా మధ్యాహ్న భోజన లలో… మంచి పౌష్టిక ఆహారం అందిస్తూ ఉన్నారు. జగనన్న విద్యా కానుక ద్వారా పిల్లలకి స్కూల్ బ్యాక్ మరియు యూనిఫామ్ లతో పాటు షూస్ ఇంకా ఇతర టెక్స్ట్ బుక్స్.. నోట్ బుక్స్ అందిస్తున్నారు. ఈ రీతిగా ఏపీలో విద్య విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుని.. విద్యార్థుల జీవితాల ద్వారా కుటుంబాల తలరాతలు మార్చే రీతిగా ముందడుగులు వేస్తున్నారు.


Share

Related posts

ఫ్యామిలీతో టూర్ మహేష్..??

sekhar

సుకుమార్ – అల్లు అర్జున్ ల పుష్ప స్క్రిప్ట్ చదివి ఆ టాప్ హీరోయిన్ అంత మాట అనిందా ?

GRK

మహేశ్ సినిమా షూటింగ్ కు మరి కొన్నాళ్లు ఆగాల్సిందేనా..!?

Muraliak