Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రస్తుతం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా చానల్ లో ప్రసారమవుతున్న ఈ షోకి భారీ ఎత్తున వ్యూస్ వస్తున్నాయట. గత సీజన్ లకు భిన్నంగా ఈసారి కంటెస్టెంట్లు ఉండటంతో పాటు ఆట మొదటి వారం నుండే చాలా రసవత్తరంగా మారింది. దీంతో ఇప్పుడు స్టార్ మా చానల్.. సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేయడం జరిగింది. తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ప్రారంభమైన రెండు వారాల్లోనే 18.1 సాధించింది అంటూ “స్టార్ మా” పోస్ట్ తెలియజేసింది. ఈ మేరకు “బిగ్ బాస్ స్పెక్ట్రాక్యులర్ కం బ్యాక్ ఇచ్చేసింది. ఎలక్ట్రిఫైయింగ్ బ్యాంగ్ తో… లాంచ్ అయినవి రియాల్టీ షో రికార్డ్స్ స్మాష్ చేసింది. 18.1 టీవిఆర్ నీ అచివ్ చేసింది” అంటూ ట్వీట్ చేసింది.
మొత్తం మీద చూసుకుంటే గత సీజన్లకు భిన్నంగా సీజన్ సెవెన్ ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంటూ ఉంది. దాదాపు రెండు మూడు సీజన్ ల నుండి తెలుగు బిగ్ బాస్ అంతగా ప్రేక్షక ఆదరణ దక్కించుకోలేదు. ఎక్కువగా హౌస్ లో సోషల్ మీడియా సెలబ్రిటీలు ఎక్కువ కావడంతో పాటు వాళ్ళు ఎవరో కూడా చూసే ఆడియన్స్ కి తెలియకపోవడంతో… షోకి పెద్ద మైనస్ అయింది. కానీ ఈసారి ఎక్కువగా సీరియల్ కంటెస్టెంట్లతో పాటు కొంతమంది సినిమా రంగానికి చెందిన వారిని తీసుకోవడంతో షో.. చూడటానికి అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.
పైగా మొదటి నుండి ఇంటి సభ్యుల మధ్య పోటీ వాతావరణ ముందే రీతిలో రకరకాల టాస్కులు పెడుతూ బిగ్ బాస్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఇదే సమయంలో ఓటింగ్ సరళి కూడా మార్చడం జరిగింది. గతంలో ఒక్కో కంటెస్టెంట్ కి 10 ఓట్లు వేసే వెసులుబాటు ఉండేది. కానీ ఈసారి ఒక ఓటు మాత్రమే. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఆడుతూ ఉన్నారు. ఈ సీజన్ లో మొత్తం 14 మంది పోటీ పడటానికి వెళ్ళగా మొదటి వారం ఒక ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు.