Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. మొత్తం 14 మంది ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 13 మంది ఉన్నారు. సెప్టెంబర్ మూడవ తారీకు ప్రారంభమైన ఈ షో.. పట్ల ఈసారి భారీ ఎత్తున ఆడియన్స్ పెరుగుతూ ఉన్నారు. ఇక ఇదే సమయంలో గతంలో మాదిరిగా కాకుండా మొదటి వారం నుండే హౌస్ లో పోటీ వాతావరణం ఉండేలా బిగ్ బాస్ టాస్క్ లు ఇస్తున్నారు. గతంలో ఒక రెండు మూడు వారాలు గడిచాక షోపై ఆసక్తి పెరిగేది. అప్పుడు గ్రూపులు ఫామ్ అయ్యి ఎవరికి వారు పోటీ పడటానికి ఆడేవాళ్లు. అప్పటివరకు తిన్నాము పడుకున్నాము తెల్లారిందా అన్న రీతిలో వ్యవహరించే వాళ్ళు. ఆరో సీజన్ లో ఇదే జరిగింది. దాదాపు నాలుగు వారాలు పాటు ఎవరు కూడా హౌస్ మేట్స్ ఆడిన దాఖలాలు లేవు.
దీంతో లాస్ట్ సీజన్ వీకెండ్ ఎపిసోడ్ లలో నాగార్జున చేత కంటెస్టెంట్లు తిట్లు తినిపించుకునే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సీజన్ సెవెన్ లో ఆ పరిస్థితి లేకుండా హౌస్ లో ఏది కావాలని పోటీదారులు కోరిన దానికి తగ్గట్టు టాస్క్ పెడుతున్నారు. దీంతో రెండోవారానికే ఇప్పుడు హౌస్ లో గ్రూపులు ఇంకా ఒకరిపై మరొకరు అరుపులు చాలా సీరియస్ వాతావరణం నెలకొంది. ఈ పరిణామంతో షో చూసే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. ఇప్పటికే టీఆర్పి రేటింగ్ లలో తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ 18.2 టీవీఆర్ అచీవ్ చేసినట్లు స్టార్ మా యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది.
అంతేకాకుండా క్రికెట్ టిఆర్పి రేటింగ్లను సైతం ఈ సీజన్ దాటేసినట్లు “స్టార్ మా” స్పష్టం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారు. ఇంచుమించు 5. 1 కోట్ల ప్రేక్షకులు మొదటి వారం బిగ్ బాస్ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 7 షో సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్ ల వ్యూస్ పరంగా నమోదైన రికార్డు లను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించి రికార్డ్స్ సృష్టించినట్లయింది.