NewsOrbit
Entertainment News Telugu TV Serials

Telugu Serials TRP Ratings: ఈ వారం టిఆర్పి రేటింగ్స్ లో ప్రధమ స్థానంలో ఉన్న టాప్ 5 తెలుగు టీవీ సీరియల్స్ ఏంటో చెప్పుకోండి చూద్దాం?

Top Telugu TV Serials TRP Ratings This Week
Share

Telugu Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ అంచనా వేయడం అంత సులభమైన విషయం కాదు. ప్రముఖ టీవీ చానెల్స్ పోటీ పడి ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ కథను ప్రేక్షకులకు మరియు పోటీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చేసి ముందుకు దూసుకువెళ్తున్నాయి. అయితే ఈ వారం ఆ మాటకొస్తే చాలా వారాలు తెలుగు టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్స్ లో ముందు ఉండేది మాత్రం స్టార్ మా సీరియల్స్. ఆ తరువాత రెండో స్థానంలో ఉండేది జీ టీవీ సీరియల్స్. మరి ఈ వారం టిఆర్పి రేటింగ్స్ లో ముందుకు దూసుకుపోతున్న సీరియల్స్ ఏమిటో మీరు అంచనా వేయగలరా?

Telugu Serials TRP Ratings: కింద నుంచి పైకి వొస్తే ఈ వారం టాప్ లో ఉన్న తెలుగు సీరియల్స్ ఇవే…

5వ స్థానంలో ఉన్న సీరియల్: నాగ పంచమి

స్టార్ మా లో కొత్తగా మొదలైన సీరియల్ నాగ పంచమి. పాములు, నాగలోకం, దైవ శక్తి లాంటి మంచి ఎలిమెంట్స్ ఉన్న కథ తో తెరకెక్కిన సీరియల్ నాగ పంచమి. మొదలైన కొద్ది కాలానికే ప్రేక్షకుల ఆధరణ పొందింది ‘నాగ పంచమి’ సీరియల్. ఈ వారం 8.81 అర్బన్ రేటింగ్స్ తో అయిదవ స్థానం లో ఉంది నాగ పంచమి.

Naga Panchami Serial మే 10: మోక్షను సర్పగండం నుండి కాపాడమని సాంబయ్యకు దండం పెట్టిన వైదేహి…పెళ్లి కూతురైన పంచమి.

4వ స్థానం లో ఉన్న సీరియల్: త్రినయని

జీ సీరియల్స్ లో ఈ మధ్య కాలంలో మంచి ప్రదర్శన కనపరుస్తున్న సీరియల్ త్రినయని. గతం భవిష్యత్తు చూడగలిగే వరం ఉన్నప్పటికీ కాలం వేసిన తాళం కి బంధీ అయి తన భర్తను కాపాడుకోవడానికి త్రినయని పడే కష్టాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వారం అర్బన్ 9.36 టిఆర్పి రేటింగ్స్ తో నాలుగోవ స్థానం లో ఉంది జీ సీరియల్ త్రినయని

3వ స్థానం లో ఉన్న సీరియల్: కృష్ణ ముకుంద మురారి

కృష్ణ ముకుంద మురారి సీరియల్ విషయానికి వొస్తే స్టార్ మా సీరియల్స్ లో ఒక సంచలన విజయం సాధించింది అని చెప్పవొచ్చు. యువత, ప్రేమ, పెళ్లి, కుటుంబం, చక్కని నటీమణులు ఉన్న ఈ స్టార్ మా సీరియల్ 9.38 టిఆర్పి రేటింగ్స్ తో మూడవ స్థానం లో ఉంది.

Krishna Mukunda Murari: మురారి పుట్టినరోజు వేడుకల్లో భవాని.. ముకుంద సైకో ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తుందా.?

2వ స్థానం లో ఉన్న సీరియల్: ప్రేమ ఎంత మధురం

ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రస్తుతానికి జీ సీరియల్స్ లో మొదటి స్థానం లో ఉంది. మధ్య వయసులో ఉన్న ఒక వ్యాపారవేత్త అతని కంటే చిన్నది అయిన హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే వారి మధ్య ఉన్న తేడాలు విబేధాలు దాటుకుని కాపురం నిలబెట్టుకోగలరా అన్నదే ఈ సీరియల్ కథనం. ఈ వారం 9.41 టిఆర్పి రేటింగ్స్ తో 2వ స్థానంలో ఉన్నది ప్రేమ ఎంత మధురం సీరియల్.

Telugu Serials TRP Ratings: 1వ స్థానంలో ఉన్న సీరియల్ బ్రహ్మముడి

బ్రహ్మముడి సీరియల్ గురించి ప్రస్తుతానికి తెలియని వారు ఎవ్వరు లేరేమో. తెలుగు సీరియల్స్ అన్నిట్లో ప్రధమ స్థానం లో ఉంది ఈ స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి. కావ్య మరియు తన చెల్లి ఎప్పుడైతే దుగ్గిరాల అన్నాతమ్ములను కాలుస్తారో వారి జీవితాలు మొత్తం మారిపోతాయి. జీవితం ఈ నలుగురికి ఎలాంటి విధిని రాసి పెట్టింది అనేది కథ. 10.94 టిఆర్పి రేటింగ్స్ తో టాప్ లో ఉన్న సీరియల్ బ్రహ్మముడి.

Brahma Mudi: తప్పు మొత్తం స్వప్న మీదకి నెట్టి తప్పించుకోవాలని చూసిన రాహుల్.. రాజ్ అతని మాటలను నమ్మాడా..?


Share

Related posts

బ‌క్క‌ చిక్కిన కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. లేటెస్ట్ ఫోటోలు చూశారా..?

kavya N

ఇండియా ఇంకా విదేశాలలో కొత్త వ్యాపారం స్టార్ట్ చేయబోతున్న ప్రభాస్..??

sekhar

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లోకి ప్రముఖ హీరో..??

sekhar