మెగాస్టార్ చిరంజీవి త్వరలో `గాడ్ ఫాదర్` అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ చేసిన సూపర్ హిట్ మూవీ `లూసిఫర్` కు ఇది రీమేక్. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 5న దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో మేకర్స్ వరుస అప్డేట్స్‌ను బయటకు వదులుతూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ `గాడ్ ఫాదర్` ఫస్ట్ సింగల్ ను బయటకు వదిలారు. `తార్ మార్ టక్కర్ మార్` అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు.
అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్రేయా ఘోషాల్ ఆలపించారు. ఈ సాంగ్ లో చిరంజీవి, సల్మాన్ ఖాన్ లు అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. వీరిద్దరి గ్రేస్‌ఫుల్ స్టెప్స్ విశేషంగా అలరిస్తున్నాయి. దీంతో ఈ సాంగ్ బయటికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో దూసుకుపోతోంది.