`థ్యాంక్యూ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. చైతు కెరీర్‌లో ఇది బాగా వ‌ర‌స్ట్!

Share

`మనం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కె కుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఇందులో రాశి ఖ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తే.. మాళవికా నాయర్, ప్రకాష్ రాజ్, సంపత్, అవికా గోర్ తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు, శిరీష్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రం జూలై 22న గ్రాండ్‌గా విడుద‌లైంది. ఫీల్ గుడ్ మూవీగా వ‌చ్చిన ఈ సినిమా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అయింది. భారీ వ‌ర్షాలు, మిశ్ర‌మ స్పంద‌న రావ‌డం, లో బ‌జ్ కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో రూ. 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 2.16 కోట్ల షేర్‌తో స‌రిపెట్టుకుంది. దీంతో చైతు కెరీర్ లోనే వ‌ర‌స్ట్‌ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా థ్యాంక్యూ నిలిచింది. ఇక ఏరియాల వారీగా థ్యాంక్యూ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 0.72 కోట్లు
సీడెడ్: 0.20 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.22 కోట్లు
తూర్పు: 0.14 కోట్లు
పశ్చిమ: 0.8 కోట్లు
గుంటూరు: 0.10 కోట్లు
కృష్ణ: 0.12 కోట్లు
నెల్లూరు: 0.7 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ‌= 1.65 కోట్లు(2.70కోట్లు~ గ్రాస్)
—————————-

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.6 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.45 కోట్లు
———————————
టోటల్ వరల్డ్ వైడ్: 2.16కోట్లు(3.70కోట్లు~ గ్రాస్)
———————————

కాగా, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ. 24 కోట్ల రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే తొలి రోజు వ‌చ్చిన క‌లెక్ష‌న్స్ కాకుండా.. ఇంకా రూ. 22.84 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేయాల్సి ఉంటుంది.


Share

Recent Posts

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

12 mins ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

20 mins ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

1 hour ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

2 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago