యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నుంచి వచ్చిన తాజా చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించారు. రాశి ఖన్నా ఇందులో మెయిన్ హీరోయిన్గా నటిస్తే.. మాళవికా నాయర్ సెకెండ్ హీరోయిన్గా చేసింది.
అవికా గోర్, ప్రకాష్ రాజ్, సంపత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమా జూలై 22న అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, తొలి షో నుండే మిశ్రమ స్పందనను దక్కించుకుని.. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్స్ ను రాబడుతోంది.
`థ్యాంక్యూ` అందుకే ఫ్లాప్ అయింది.. నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్!
తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా.. రెండు రోజు కేవలం రూ. 70 లక్షల షేర్‌ను వసూల్ చేయగలిగింది. ఇక మూడో రోజు థ్యాంక్యూ పరిస్థితి మరింత దారుణంగా మారింది. సండే అయినప్పటికీ గ్రోత్ చూపించలేక రూ. 40 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. అలాగే వరల్డ్ వైడ్‌గా రూ. 50 లక్షల రేంజ్ లో షేర్ ని దక్కించుకుంది. ఇక ఏరియాల వారీగా థ్యాంక్యూ మూడు రోజుల టోటల్ కలెక్షన్స్‌ను ఓసారి గమనిస్తే..
నైజాం: 1.15 కోట్లు
సీడెడ్: 0.232 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.42 కోట్లు
తూర్పు: 0.23 కోట్లు
పశ్చిమ: 0.14 కోట్లు
గుంటూరు: 0.18 కోట్లు
కృష్ణ: 0.20 కోట్లు
నెల్లూరు: 0.11 కోట్లు
—————————-
ఏపీ+తెలంగాణ=2.75 కోట్లు(4.60కోట్లు~ గ్రాస్)
—————————-
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా: 0.11 కోట్లు
ఓవర్సీస్: 0.74 కోట్లు
———————————
టోటల్ వరల్డ్ వైడ్: 3.60కోట్లు(6.25 కోట్లు~ గ్రాస్)
———————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 24 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. దీంతో ఇప్పుడీ మూవీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అవ్వాలంటే తొలి మూడు రోజులు వచ్చిన కలెక్షన్స్ కాకుండా.. ఇంకా రూ. 21.40 కోట్ల షేర్‌ను వసూల్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు కనిపించలేదు. దీంతో బిగ్ డిజాస్టర్ నుండి చైతూను ఇక ఎవరూ కాపాడలేరని అంటున్నారు.