33.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Entertainment News సినిమా

ఆక‌ట్టుకుంటున్న చైతు `థాంక్యూ` ట్రైల‌ర్‌.. ఆ డైలాగే హైలైట్‌!

Share

య‌వ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కె. కుమార్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో రాశి ఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్లుగా న‌టించారు. మ్యూజిక్ సెన్షేష‌న్ త‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు.

ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం.. ఫైన‌ల్‌గా జూలై 22న గ్రాండ్‌గా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే `థ్యాంక్యూ` ట్రైల‌ర్ ను తాజాగా బ‌య‌ట‌కు వ‌దిలారు.

థాంక్యూ లో సమంత.. మజిలీ కాంబో మళ్ళీ రిపీట్ ..?

`మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే.. మనం చేరుకున్న గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు` అంటూ చైతు చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఇదో ఔట్ అండ్ ఔట్ ఫీల్ గుడ్ మూవీ అని ట్రైల‌ర్ బ‌ట్టీ అర్థం అవుతోంది. స్కూల్ డేస్ మొదలుకొని.. డిఫరెంట్ స్టేజెస్ లో హీరో లైఫ్ జర్నీను ట్రైలర్ లో చూపించారు.

ఆయా స్టేజ్ ల‌లో చైతు లుక్స్ లోని వెరీయేషన్స్ బాగా అల‌రించాయి. చివ‌ర్లో `ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది` అని చైతు చెప్పే డైలాగ్ ట్రైల‌ర్‌కే హైలైట్ గా నిలిచింది. విజువ‌ల్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటి అంశాలు కూడా బాగున్నాయి. మొత్తానికి అదిరిన ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేసింది. మ‌రి ఆ అంచ‌నాల‌ను చైతు అందుకుంటాడో..లేదో..చూడాలి.


Share

Related posts

60 రోజులు ఒకే చోట చేశారా?

Siva Prasad

Brahmanandam Birthday Special: ఓన్లీ వన్ స్టార్.. ది కమెడీయన్ స్టార్.. ‘బ్రహ్మీ’

Raamanjaneya

Samantha : లోపలొకటి, బయటికొకటి మాట్లాడటం నాకు చేతకాదు: సమంత

Ram