టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో గా హిట్ అందుకుని చాలా కాలమే అయింది. అయితే ఈసారి `ది ఘోస్ట్` మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆయన ముచ్చటపడుతున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. గుల్ పనాగ్, అనైక సురేంద్రన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రానికి తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కానీ, యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడే వారికి ఘోస్ట్ కచ్చితంగా నచ్చుతుంది.
యాక్షన్ సీన్స్ లో నాగ్ స్క్రీన్ ప్రెజన్స్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తాయి. అయితే టాక్ బాగుతున్నా.. నాగార్జున్ తొలి రోజు ఊహించిన రేంజ్లో వసూళ్లను రాబట్టలేకపోయాడు. తెలుగుతో రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 2 కోట్ల రేంజ్లో షేర్ ను రాబట్టిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ. 2.45 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుంది.
నైజాం: 57 లక్షలు
సీడెడ్: 25 లక్షలు
ఉత్తరాంధ్ర: 31 లక్షలు
తూర్పు: 23 లక్షలు
పశ్చిమ: 8 లక్షలు
గుంటూరు: 22 లక్షలు
కృష్ణ: 19 లక్షలు
నెల్లూరు: 15 లక్షలు
————————————–
ఏపీ+తెలంగాణ= 2.00కోట్లు(3.60కోట్లు~ గ్రాస్)
————————————–
కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా – 20 లక్షలు
ఓవర్సీస్ – 25 లక్షలు
——————————————
టోటల్ వరల్డ్ వైడ్ – 2.45కోట్లు(4.60కోట్లు~ గ్రాస్)
——————————————
కాగా, వరల్డ్ వైడ్‌గా రూ. 21.15 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ క్లీన్ గా నిలవాలంటే తొలి రోజు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 19.55 కోట్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఇంత భారీ టార్గెట్‌ను అందుకోవాలంటే.. ఇప్పుడున్న స్పీడ్ చాలదు బాసు అంటున్నారు నెటిజన్లు.